గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
యునిసెఫ్, డబ్ల్యూహెచ్ ఓ సహకారంతో గిరిజన సేకరణదారులు తమ పనిని సురక్షితంగా కొనసాగించేలా చూడటానికి స్వయం సహాయక సంఘాల కోసం వెబ్‌నార్ ద్వారా డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించిన ట్రైఫెడ్
ఈ ప్రచారం ద్వారా 50 లక్షల మంది గిరిజన సంఘాలను చేరుకోవాలని ప్రతిపాదన
Posted On:
09 APR 2020 8:05PM by PIB Hyderabad
కోవిడ్ -19 పై ప్రాథమిక అవగాహన కల్పించడానికి, గిరిజన సంగ్రాహకులు తమ పనిని సురక్షితంగా కొనసాగించేలా చూడడానికి కీలకమైన నివారణ చర్యలపై శిక్షకులు,స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) ఈ రోజు ట్రైఫెడ్ వెబ్‌నార్, వర్చువల్ శిక్షణ ప్రారంభించింది. మొత్తం 27 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలలో 18,000 మందికి పైగా ఈ కార్యక్రమం చేరుకోవడమే లక్ష్యం. ఈ కార్యంలో డిజిటల్ సమాచార వ్యూహం ద్వారా స్వయం సహాయక గ్రూపులను భాగస్వామ్యం చేస్తారు. సామాజిక దూరంపై ముఖ్యంగా అవగాహన కల్పిస్తారు. ఈ విపత్కర పరిస్థితుల్లో గిరిజనుల భద్రత తమకు అత్యధిక ప్రాధాన్యత అంశమని ట్రైఫెడ్ ఎండి శ్రీ ప్రవీర్ కృష్ణ సమావేశంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి చెప్పారు. అటవీ ఉత్పత్తులు చేతికొచ్చే ప్రస్తుత సమయంలో అప్రమత్తమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
యూనిసెఫ్ స్వయం సహాయక గ్రూపులకు అవసరమైన డిజిటల్ సహకారాన్ని అందిస్తుంది. ట్రైఫెడ్ కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా గిరిజనుల కు కావలసిన నిత్యావసరాలను సమకూరుస్తుంది. 27 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 1205 వన్‌ధన్ వికాస కేంద్రాలు (విడివికెలు), 18,075 వన్ ధన్ స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీరందిరికి దశల వారీగా చైతన్య, అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తారు.
****
(Release ID: 1612729)
Visitor Counter : 160