ప్రధాన మంత్రి కార్యాలయం

భారత, అమెరికా భాగస్వామ్యం మున్నెన్న‌టి కంటే బలంగా ఉందన్న ప్రధాన‌మంత్రి

Posted On: 09 APR 2020 10:51AM by PIB Hyderabad

భార‌త , అమెరికా భాగ‌స్వామ్యం మున్నెన్న‌టి కంటే బ‌లంగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్ర శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.
కోవిడ్ -19 పై అమెరికా  జ‌రుపుతున్న పోరాటానికి  అనుగుణంగా ఆ దేశానికి హైడ్రాక్సిక్లోరోక్విన్ ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని భార‌త‌దేశం తీసుకున్న నిర్ణ‌యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంస్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ  ఈమాట‌ల‌న్నారు.
అమెరికా అధ్య‌క్షుడి ట్వీట్ కు స్పందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, “ ఇలాంటి సమయాలు స్నేహితులను దగ్గర చేస్తాయి. భారత్-యుఎస్ భాగస్వామ్యం గతంలో కంటే బలంగా ఉంది. మానవాళికి సహాయం చేయడానికి భారతదేశం సాధ్యమైన ప్రతిదీ చేస్తుంది” అని పేర్కొన్నారు..(Release ID: 1612469) Visitor Counter : 182