మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై పోరాటం, భ‌విష్య‌త్ స‌వాళ్ల‌కు సంబంధించి స‌మాధాన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌

స‌మాధాన్ స‌వాలుకు ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఆఖ‌రు తేదీ 14 ఏప్రిల్ 2020

Posted On: 07 APR 2020 5:41PM by PIB Hyderabad

విద్యార్థుల‌లో గ‌ల ఆవిష్క‌ర‌ణ  నైపుణ్యాల‌ను ప‌రీక్షించించేందుకు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌ , ఆలిండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ లు  ఫోర్జ్‌, ఇన్నొవేషియో క్యూరిస్ ల కొలాబ‌రేష‌న్‌తో ఒక మెగా ఆన్‌లైన్ ఛాలెంజ్ - స‌మాధాన్ ను ప్రారంభించింది.
ఈ స‌వాలులో పాల్గొంటున్న విద్యార్థులు, క‌రొనా వైర‌స్ మ‌హ‌మ్మారి, ఇలాంటి ఇత‌ర విప‌త్తుల‌పై పోరాడే ప్ర‌భుత్వ ఏజెన్సీలు, ఆరోగ్య స‌ర్వీసులు, ఆస్ప‌త్రులు, ఇత‌ర సేవ‌ల వారికి త‌క్ష‌ణ ప‌రిష్కారాల‌ను అందుబాటులోకి తెచ్చే చ‌ర్య‌ల‌ను అభివృద్ధిచేసే మార్గాలు అన్వేషిస్తారు. దీనితోపాటు, ఈ స‌మాధాన్ ఛాలెంజ్‌కింద‌, ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతులను చేయ‌డం వారికి ప్రేర‌ణ‌నివ్వ‌డం, ఎలాంటి స‌వాలునైనా ఎదుర్కొనేందుకు సిద్దం చేయ‌డం, ఎలాంటి సంక్షోభాన్నైనా అరిక‌ట్ట‌డం, ప్ర‌జ‌ల‌కు జీవ‌నోపాధి క‌ల్పించ‌డంలో స‌హాయ‌ప‌డ‌డం  వంటివి కూడా ఉన్నాయి.
సమాధాన్ చాలెంజ్ కింద‌, విద్యార్ధులు, అధ్యాప‌కులు కొత్త‌ ప్ర‌యోగాలు చేయ‌డానికి, నూత‌న అన్వేష‌ణ‌ల‌కు ప్రేర‌ణ క‌ల్పిస్తారు. ఆ ర‌కంగా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లకు ,ప్ర‌యోగాలకు స్పూర్తినిచ్చే బ‌ల‌మైన పునాది ఏర్ప‌రుస్తారు.
ఈ కార్యక్రమం  విజయం ,సాంకేతికంగా , వాణిజ్యపరంగా పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యంపైన‌, ఈ పోటీలో పాల్గొనే పోటీదారుల ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయ‌న్న‌దానిపైన  ఆధారపడి ఉంటుంది, ఆ ర‌కంగా  ఇది కరోనావైరస్ వంటి మ‌హ‌మ్మారిపై పోరాడటానికి సహాయపడుతుంది.
ఈ పోటీలోపాల్గొన‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం 7 ఏప్రిల్ 2020 నుంచి ప్రారంభ‌మౌతుంద‌. ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించ‌డానికి చివ‌రితేదీ 14 ఏప్రిల్ 2020. ఈ పోటీ నుంచి ముందుకు వెళ్ళే పోటీదారుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసిన త‌ర్వాత 17 ఏప్రిల్ 2020న ప్ర‌క‌టిస్తారు. వీరు త‌మ ఎంట్రీల‌ను2020 ఏప్రిల్ 18-23 మ‌ధ్య త‌మ ఎంట్రీల‌ను స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది.  తుది జాబితాను 24 ఏప్రిల్ 2020న ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం ఆన్‌లైన్ గ్రాండ్ జ్యూరీ ప‌రిశీలించి విజేత‌ల‌ను 25 ఏప్రిల్ 2020న నిర్ణ‌యిస్తుంది.



(Release ID: 1612058) Visitor Counter : 211