విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ దీపాలు ఆర్పాలనే ప్రధాని పిలుపునకు “భారీ స్పందన” – కేంద్ర విద్యుత్ మంత్రి వెల్లడి

Posted On: 06 APR 2020 6:15PM by PIB Hyderabad

కోవిడ్ -19 విశ్వ మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా తొమ్మిదవ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పి జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు భారీ స్పందన లభించిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ  ఆర్. కె. సింగ్ ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక తెలిపారు. ఇంటిలో విద్యుత్ దీపాలు ఆర్పి ప్రతి ఒక్కరూ జ్యోతిని వెలిగించే సంఘీభావ ప్రకటన సందర్భంగా విద్యుత్ గ్రిడ్ నిర్వహణ పనులను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి ఆ తరువాత పై ప్రకటన చేయ్శారు.  

మంత్రి శ్రీ సింగ్ తన అధికారులతో కలసి జాతీయ విద్యుత్ పర్యవేక్షణ కేంద్ర వద్ద గ్రిడ్ వ్యవహారాలు చూస్తుండగా ఆయన కుటుంబ సభ్యులందరూ ఇంటిలో ఉండి అందరి మేలును కాంక్షిస్తూ ఆశా ‘జ్యోతులు’ వెలిగించారు. 

ఆదివారం రాత్రి 8-49 నిముషాలకు 117300 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ రాత్రి 9-09 నిముషాలకు 85300 మెగావాట్లకు తగ్గిపోయిందని మంత్రి ట్వీట్ చేశారు.  అంటే కొద్ది నిముషాలలోనే డిమాండ్ 32000 మెగావాట్లు తగ్గింది.  ఆ తరువాత మళ్ళీ పెరగడం మొదలైంది.  ఆ సమయంలో వోల్టేజిని స్థిరంగా ఉంచారని మంత్రి వెల్లడించారు.  విద్యుత్ డిమాండ్ డిమాండ్ 32000 మెగావాట్లు తగ్గడం అంటే ప్రధాన మంత్రి పిలుపునకు భారీ స్పందన లభించిందని ఆయన అన్నారు. 

సంఘీభావంగా విద్యుత్ దీపాలు ఆర్పడం విజయవంతంగా పూర్తి చేయడం పట్ల జాతి జనులను,  ఒక జట్టుగా పని చేసినందుకు జాతీయ విద్యుత్ వ్యవస్థను మంత్రి శ్రీ సింగ్ అభినందించారు.  9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు అర్పాలన్న ప్రధాన మంత్రి పిలుపునకు స్పందించి తమ పాత్రను విజయవంతంగా నేరవేర్చినందుకు ఆయన భారత పౌరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఒక జట్టుగా పని చేసిన  జాతీయ గ్రిడ్ నిర్వాహకులు పోసోకో సంస్థను మరియు విద్యుత్ ఉత్పాదన కంపెనీలు ఎన్ టి పి సి , ఎన్ హెచ్ పి సి , టి హెచ్ డి సి, నీప్కో, ఎస్ జె వి ఎన్ ఎల్, బి బి ఎం బి , పి జి సి ఐ ఎల్  మరియు అధికారులు , వారితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖల ఇంజనీర్లను మంత్రి ప్రశంసించారు.  

     “కరోనా వైరస్ పై చేస్తున్న ఈ పోరాటంలో మనందరం, జాతి మొత్తం కలసికట్టుగా  ప్రధాన మంత్రి వెంట ఉంది. భారత్ మొత్తం ప్రధానమంత్రి వెంట నడుస్తోంది” అని మంత్రి శ్రీ సింగ్ తమ ప్రకటన ముగించారు. 

 



(Release ID: 1611820) Visitor Counter : 197