శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 ను గుర్తించడం కోసం వేగవంతమైన రక్షణ పరీక్షను అభివృద్ధి చేసిన ఆరోగ్య సంరక్షణ అంకుర సంస్థకు మద్దతు ఇచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి)

Posted On: 06 APR 2020 3:21PM by PIB Hyderabad

కోవిడ్ -19 వేగవంతమైన నిర్ధారణ పరీక్ష చేసే పరికరాన్ని రూపొందించిన పూణెకు చెందిన ఆరోగ్య  సంరక్షణ అంకుర సంస్థకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి) మద్దతు నిచ్చింది. మాడ్యూల్ ఇన్నోవేషన్స్ కు నిధులు సమకూర్చడంలో భాగంగా, 10 నుంచి 15 నిముషాల్లో కోవిడ్ -19 పరీక్షలు చేసే ఈ పరికరాన్ని రూపొందించారు.

యూ సెన్స్ నుంచి నిరూపితమైన భావనను ఉపయోగించి, ఎన్.సి.ఓ. వి.ఎస్.ఈ.ఎన్.ఎస్.ఈ. ఎస్(టి.ఎం) (nCoVSENSe - TM)  ను అభివృద్ధి చేస్తోంది. ఇది మానవ శరీరంలోని కోవిడ్ -19 కి వ్యతరేకంగా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలను గుర్తించడానికి వేగవంతమైన పరీక్షా పరికరం.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో, మాస్ స్క్రీనింగ్ చేయడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వేగవంతమైన పరీక్షా పరికరంతో రోగుల్లో సంక్రమణను నిర్థారించడం, రోగులు కోలుకున్నారో లేదో నిర్థారించడం మరియు రోగుల్లో సంక్రమణ దశను కూడా గుర్తించడం సాధ్యమౌతుంది.

రియల్ లైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్.టి-పి.సి.ఆర్) ప్రస్తుత నిర్థారణ పద్ధతి గోల్డ్ స్టాండర్డ్ ఖరీదైనదే కాకుండా, ఎక్కువ సమయం పట్టడం, శిక్షణను అందించడం అవసరం. కానీ ప్రస్తుతం కనిపెట్టిన వేగవంతమైన పరీక్ష తక్కువ ఖర్చుతో సమస్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఇది పి.సి.ఆర్. బేస్డ్ కన్ఫర్మేటరీ టెక్నిక్ కు ప్రత్యామ్నాయం కానప్పటికీ, యాంటీబాడీస్ ను గుర్తించడంపై ఆధారపడిన పరీక్షలు వేగంగా మాస్ స్క్రీనింగ్ ల కోసం ప్రపంచవ్యాప్తంగా మోహరించబడుతున్నాయి. ఇవి పరిమిత సంఖ్యంలో పి.సి.ఆర్. యంత్రాల నుంచి భారాన్ని తగ్గించడమే కాకుండా, సూత్రీకరణ కోసం సహాయపడతాయని శాస్త్ర మరియు సాంకేతిక విభాగ కార్యదర్శి ప్రొ. అశుతోష్ శర్మ తెలిపారు.

 

ncovsense

వైరల్ ఇన్ఫెక్షన్ ప్రారంభమైన తర్వాత మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఐ.జి.జి మరియు ఐ.జి.ఎం. ప్రతి నిరోధకాలను గుర్తించడం ఎన్.సి.ఓ. వి.ఎస్.ఈ.ఎన్.ఎస్.ఈ. (nCoVSENSe) పరీక్ష మరియు కోవిడ్ -19 కోసం ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్లకు వ్యతిరేకంగా పని చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది.

ఈ అంకుర సంస్థ జాతీయ ఏజెన్సీల సరైన ధృవీకరణ తర్వాత 2 నుంచి 3 నెలల వ్యవవధిలో పరీక్షలను అమలు చేయడానికి యోచిస్తోంది. భవిష్యత్తులో ఇది కోలుకున్న వ్యక్తులను గుర్తించడానికి మరియు వారికి ప్రధాన విభాగంలో పనిని ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు మరియు ఇలాంటి అనేక ప్రదేశాల్లో రోగులను మరియు ప్రయాణికులను పరీక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా భవిష్యత్తులో దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది.

దీని సాంకేతికత యొక్క సాధ్యాసాధ్యాలు నిరూపించబడినప్పటికీ, ఉత్పత్తి యొక్క కార్యాచరణను వివరించే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) మరియు ప్రోటోటైప్ ప్రదర్శించవలసి ఉంది.

 

 (మరిన్ని వివరాల కోసం సంప్రదించండి

సచిన్ దూబే

sachin@moduleinnovations.com

7350840295)



(Release ID: 1611664) Visitor Counter : 273