శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణా ప‌రిక‌రాల‌ను ధ‌రించ‌డం మ‌న‌కు తెలిసిందే. దీన్నే ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పిపిఇ) అంటారు. ఈ పిపిఇలో ఉప‌యోగించే యాంటీ వైర‌ల్ నానో కోటింగ్‌, నానో ఆధారిత మెటీరియ‌ల్‌ను త‌యారు చేయ‌డానికిగాను ప్ర‌తిపాద‌న‌ల రూపంలో సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్ టి) విజ్ఙ‌ప్తి చేస్తోంది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బోర్డ్ ( ఎస్ ఇ ఆర్ బి) పోర్ట‌ల్ లో ఈ విజ్ఞ‌ప్తిని చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల్ని భాగ‌స్వామ్య ప‌రిశ్ర‌మ‌ల‌కు లేదా స్టార్ట‌ప్ కంపెనీల‌కు పంపుతామ‌ని డిఎస్ టి తెలిపింది. అలాంటి నానో కోటింగ్ మెటీరియ‌ల్ అనేది కోవ‌డ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాటానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని డిఎస్ టి వివ‌రించింది. తాము చేప‌ట్టిన ఈ నానో మిష‌న్ విజ‌య‌వంతం కావ‌డానికి అక‌డ‌మిక్ సంస్థ‌లు, ఇత‌ర పారిశ్రామిక సంస్థ‌లు ఉప‌యోగ‌ప‌డాల‌నే ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్టు డిఎస్ టి తెలిపింది.

Posted On: 06 APR 2020 3:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా వాడుతున్న మూడు పొర‌ల మెడిక‌ల్ మాస్కులు, ఎన్ -95 రెస్పిరేట‌ర్ లేదా మెరుగైన మాస్కుల త‌యారీకి, పిపిఇల త‌యారీలో వాడే  యాంటీ వైర‌ల్ నానో కోటింగుల‌ను అభివృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్టు డిఎస్ టి వివ‌రించింది. 
ఈ ప్ర‌తిపాద‌న‌ల్ని ఈ నెల 30 లోపు పంపాల్సి వుంటుంది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని కోరారు. 
దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను  www.serbonline.in లో చూడ‌వ‌చ్చు. సంప్ర‌దించాల‌న్సిన శాస్త్ర‌వేత్త‌లు : 
డాక్ట‌ర్ టి. తంగ‌రాద్ జౌ, సైంటిస్ట్ ఇ, ఎస్ ఇఆర్ బి, ఇమెయిల్ ttradjou@serb.gov.in
డాక్ట‌ర్ నాగ భూప‌తి మోహ‌న్‌, సైంటిస్ట్ ఇస‌, డిఎస్ టి  Email: boopathy.m[at]gov[dot]in
శ్రీ రాజీవ్ ఖ‌న్నా, సైంటిస్ట్ సి, డిఎస్ టి Email: Khanna.rk[at]nic[dot]in
మ‌రిన్ని వివ‌రాల‌కోసం సంప్ర‌దించాల్సిన శాస్త్ర‌వేత్త‌లు 
డాక్ట‌ర్ మిలింద్ కుల‌క‌ర్ణి, సైంటిస్ట్ జి అండ్ హెడ్‌, నానో మిష‌న్‌, డిఎస్ టి
ఇ మెయిల్ :  మిలింద్ @ ఎన్ ఐ సి. milind[at]nic[dot]in, Mob.: +91-9650152599, 9868899962

 



(Release ID: 1611659) Visitor Counter : 157