బొగ్గు మంత్రిత్వ శాఖ

భువనేశ్వర్ లో ఉన్న కోవిడ్-19 ఆసుపత్రికి నిధులు అందజేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఎం.సి.ఎల్. : ప్రహ్లాద్ జోషి.

Posted On: 06 APR 2020 2:31PM by PIB Hyderabad

" భువనేశ్వర్ లోని  దేశంలోనే రెండవ అతి పెద్ద కోవిద్-19 ఆసుపత్రిలో రోగుల చికిత్స వ్యయంతో సహా అన్ని ఖర్చులు మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎం.సి.ఎల్.) భరిస్తుంది. ఎం.సి.ఎల్. ఇప్పటికే రూ.7.31 కోట్లు తక్షణ సహాయం కింద విడుదల చేసింది.  ఒడిశా ప్రజలకు వైద్య పరంగా ఈ ఆసుపత్రి ఒక గొప్ప ఆస్తి," అని బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు 

500 పడకలు, వెంటిలేటర్లు తో పాటు 25 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు.) పడకలు ఉన్న ఆసుపత్రి మొత్తం నిర్వహణ వ్యయాన్ని కోల్ ఇండియా అనుబంధ కంపెనీ అయిన మహానంది కోల్ ఫీల్డ్స్ (ఎం.సి.ఎల్.) భరిస్తోంది.    ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.   ఒడిశా ప్రభుత్వం ఈ రోజు భువనేశ్వర్ లో ఈ ఆసుపత్రిని ప్రారంభించింది.   పెట్రోలియం, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా ఖనిజ నిధి (డి.ఎం.ఎఫ్.) లోని  మిగులు నిధుల్లో 30 శాతం వరకు మొత్తాన్ని, కోవిడ్ -19 వ్యాప్తి నిరోధక కార్యాక్రమాలకు వినియోగించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేసిందని  కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నఖనిజాల సంపద కలిగిన ఒడిశా లాంటి ధనిక రాష్ట్రానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆయన అన్నారు. 

"ప్రపంచంలోని చాలా దేశాలను ముంచెత్తిన కోవిడ్-19 కు వ్యతిరేకంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సాధ్యమైనంత ఉన్నత స్థాయిలో సహకారం అందించాలని, బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని 

పి.ఎస్.యు. లను వ్యక్తిగతంగా నేను ఆదేశించాను. ఈ పి.ఎస్.యు. లు సందర్భోచితంగా తమ సహాయాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. " అని బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

కోల్ ఇండియా సంస్థకు చెందిన అనుబంధ కంపెనీలు, ఎనిమిది రాష్ట్రాలలో 1500 కు పైగా క్వారంటైన్ / ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశాయి.  అదేవిధంగా, భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న నాల్కో ఉద్యోగులు రూ. 2.50 కోట్ల మేర తమ ఒక రోజు జీతాన్ని ఒడిశా ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. కోరాపుట్ జిల్లాలో ఒడిశా ప్రభుత్వం కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా నెలకొల్పుతున్న ఆసుపత్రి కి అవసరమైన  నిధులు సమకూర్చడానికి  నాల్కో తన సమ్మతిని తెలియజేసింది. 

**** 


(Release ID: 1611655) Visitor Counter : 185