గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19ని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాలలో స్మార్ట్‌సిటీ మిషన్‌కు చెందిన
సమీకృత డాటా డాష్ బోర్డుల వినియోగం
Posted On:
06 APR 2020 2:44PM by PIB Hyderabad
పూణే, సూరత్, బెంగళూరు తుమకూరు స్మార్ట్ సిటీలు సమగ్ర డేటా డాష్‌బోర్డులను ఉపయోగిస్తున్నాయి, వీటిని డేటా విశ్లేషకులు వారి ఐసిసిసిలతో కలిసి పనిచేసే డేటా నిపుణులు అభివృద్ధి చేశారు (అనేక నగరాల్లో COVID-19 వార్ రూమ్‌లుగా కూడా ఇవి పనిచేస్తున్నాయి).ఇవి ఆయా నగరాలలోని వివిధ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి.
పూణె: పూణే స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎస్‌సిడిసిఎల్) పూణే మునిసిపల్ కార్పొరేషన్ (పిఎమ్‌సి) తో కలిసి కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి నగరం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా ఇంటిగ్రేటెడ్ డేటా డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.నగరంలోని ప్రతి కేసును భౌగోళిక-ప్రాదేశిక సమాచార వ్యవస్థలను ఉపయోగించి మ్యాప్ చేయడం జరిగింది.. నగరంలోని వివిధప్రాంతాలను ఇది పర్యవేక్షిస్తుంది . COVID-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన కేసులు ఉన్న బఫర్ జోన్‌లను నగర పాలనాయంత్రాంగం పర్యవేక్షిస్తుంద.
హీట్ మ్యాపింగ్ టెక్నాలజీలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ను ఉపయోగించి, నగర పాలనా యంత్రాంగం కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధ ప్రణాళికను రూపొందించనుంది. వ్యాధిని నియంత్రణ జోన్లకు సంబంధించిన సమాచారాం డ్యాష్‌బోర్డులో కనిపిస్తుంది. నగరంలోని నాయుడు అంటువ్యాధుల ఆస్పత్రికి సంబంధించిన కార్యకలాపాలను ఈ కేంద్రంలో పరిశీలించడం జరుగుతుంది. స్మార్ట్‌సిటీ కి చెందిన సమీకృత డాష్ బోర్డు క్వారంటైన్ సదుపాయాలను పరిశీలిస్తుంది. అలాగే అనుమానిత రోగుల ఆరోగ్యాన్ని , వారితో సన్నిహితంగా మెలిగిన ఇంటివద్దే క్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితిని కూడా ఇది పర్యవేక్షిస్తుంది.
సూరత్ : సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ తన మునిసిపల్ వెబ్‌సైట్‌లో రెగ్యులర్ అప్‌డేట్‌లను ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డు ద్వారా పౌరులకు అందిస్తోంది. కరోనా పరీక్షలు , నిర్ధారిత కేసులు, చురుకుగా ఉన్న కేసులు, కోలుకున్న వారు, మరణించిన కేసులకు సంబంధించిన గణాంకాలను డాష్ బోర్డులో ఇస్తున్నారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తి దశ, ధోరణి నగరంలో ఎలా ఉందన్నది రోజువారీగా గణాంకాలు ఇస్తున్నారు. అలాగే తేదీ వారిగా, వయసుల వారీగా , జోన్లు, స్త్రీ పురుష పేషెంట్లు తదితర సమాచారం అంతా గణాంకాల రూపంలో ఇస్తున్నారు. ఈ పేజీలో నగరంలో వ్యాధి బారిన పడిన ప్రాంతాలను గుర్తించి తెలియజేస్తున్నారు. ఈ డ్యాష్ బోర్డును పౌరులు ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.
https://www.suratmunicipal.gov.in/others/CoronaRelated.
బెంగలూరు, తుముకూరు: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బిఇపిఎంపి , కరోనా నిర్దారిత పేషెంట్లు గల 8 కిలోమీటర్ల వ్యాసార్థంలొ ప్రజలపై నిరంతర నిఘా ఉంచేందుకు ఒక వార్‌రూం ను ఏర్పాటు చేసింది.
కోవిడ్ -19 డాష్‌బోర్డ్‌ను ఉపయోగించుకుంటూ , బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్- బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కి చెందిన వార్ రూమ్, కరోనా వైరస్ వ్యాప్తి పోకడలపై రోజువారీ బులెటిన్‌ను వెలువరిస్తోంది.. తేదీ , జోన్ల వారీగా, ఆసుపత్రి వారీగా, వయస్సు వారీగా మరియు స్త్రీ .పురుషల వారీగా వివరాలను వార్‌రూమ్‌లో సేకరిస్తారు. రోజువారీ ప్రాతిపదికన ఈ సమాచారాన్ని ప్రచురిస్తారు
కోవిడ్ -19 వార్ రూమ్‌లుగా సమీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్లు (ఐసిసిసి)
కోవిడ్-19 వార్ రూమ్ లుగా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ , కంట్రోల్ సెంటర్లు, పబ్లిక్ ప్రదేశాలపై సిసిటివి నిఘాపెడుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసుల జిఐఎస్ మ్యాపింగ్ , ఆరోగ్య సంరక్షణ కార్మికుల జిపిఎస్ ట్రాకింగ్ వంటి వాటిని దీని ద్వారా అమలు చేస్తున్నారు. అలాగే, నగరంలోని వివిధ జోన్లలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రిడిక్టివ్ అనలటిక్స్(హీట్ మ్యాప్‌లు), వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి వర్చువల్ శిక్షణ, అంబులెన్సు, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి రహిత సేవలు రియల్ టైమ్ ప్రాతిపదికన పర్యవేక్షణ వంటివి చేపడుతున్నారు. అలాగే వైద్య సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్, టెలి కౌన్సిలింగ్ ,టెలి మెడిసిన్ ద్వారా కల్పిస్తున్నారు.
(Release ID: 1611651)
Visitor Counter : 258