ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్, సమాజిక దూరాలే కోవిడ్-19కు మేటి సామాజిక వ్యాక్సిన్లుః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్
- కరోనా రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి..
- భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య సామగ్రి ఆర్డర్ చేసినట్టు వెల్లడి
- కోవిడ్-19కు పూర్తిస్థాయి చికిత్స కేంద్రంగా ఎయిమ్స్ జాజ్జర్ ఆసుపత్రి
Posted On:
05 APR 2020 6:07PM by PIB Hyderabad
భయంకరమైన కోవిడ్-19 వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్ర్తవేత్తలు పగలు, రాత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. అయితే వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్‌డౌన్ మరియు సామాజిక దూరం కలయికలను కోవిడ్-19కు వ్యతిరేకంగా సమర్థవంతమైన సామాజిక వ్యాక్సిన్‌గా ప్రజలు పరిగణించాలని ఆయన సూచించారు. కోవిడ్-19కు పూర్తిస్థాయి చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ జాజ్జర్ ఆసుపత్రిలో సంసిద్ధత ఏర్పాట్లను తెలుసుకొనేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఆదివారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ను సందర్శించారు. ఇకపై ఎయిమ్స్ జాజ్జర్ ఆసుపత్రి కోవిడ్-19 వైరస్ చికిత్సకు పూర్తిస్థాయి ఆసుప్రతిగా పని చేస్తుందని ఆయన తెలిపారు. జాజ్జర్లో కోవిడ్-19 చికిత్స కోసం 300 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డులను అధునాత వైద్య సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వివరించారు. తన సమీక్ష సందర్శనలో భాగంగా ఐసోలేషన్ సదుపాయం ఉన్న అత్యాధునిక భవనంలోని వివిధ సౌకర్యాలను గురించి ఆయన వాకబు చేశారు. దీనికి తోడు విశ్రామ్ సదన్, వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది నివాస గృహాల సముదాయాన్ని ఆయన సందర్శించారు.
రోగులతో వీసీలో ముచ్చటించిన మంత్రి..
తన పర్యటన సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కోవిడ్-19 సోకిన రోగులతో వీడియోకాల్లో ముచ్చటించారు. వారి బాగోగులను గురించి అడిగి తెలుసుకున్నారు. అందుతున్న చికిత్స వివరాలను కూడా తెలుసుకున్నారు. జాజ్జర్ కేంద్రంలో కోవిడ్-19 రోగుల నిమిత్తం అందుతున్న సేవలను గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇతర సౌకర్యాలు ఏమైనా కావాలా అని కూడా మంత్రి వారిని వాకబు చేశారు. వారి సలహలతో కేంద్రంలో సేవలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు వీలుపుడుతుందని మంత్రి తెలిపారు.
ఆరోగ్య యోధుల సేవలు ప్రశంసనీయం..
వైరస్ బాధితుల మేలుకోసం వీడియో, వాయిస్ కాల్ వంటి డిజిటల్ వేదికలపై నిరంతరాయంగా సేవలందిస్తున్న ఎయిమ్స్ జాజ్జర్ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. తాను కొన్ని రోజులగా కోవిడ్-19పై పోరునకు గాను మన సంసిద్ధతను తెలుసుకొనేందుకు గాను ఎయిమ్స్ (ఢిల్లీ), ఎల్ఎన్‌జేపీ, ఆర్ఎంఎల్, సఫ్దర్‌జంగ్‌తో పాటు ఎయిమ్స్, జాజ్జర్ ఆసుపత్రులను సందర్శిస్తూ వస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశం అత్యంత కఠినమైన పరీక్ష సమయంలో ఉన్నప్పుడు మన ఆరోగ్యయోధులు నిజాయితీగా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తగిన సేవలనందించడాన్ని ఆయన హృదయ పూర్వకంగా అభినందించారు.
వైద్య చికిత్సలకు అవరోధం కల్పిస్తే కఠిన చర్యలు..
కరోనా వైరస్ బాధితులకు చికిత్సనందిస్తున్న సమయంలో రోగులు వారి బంధువులు వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తల విధులను అడ్డకోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయని ఆయన అన్నారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో మన వైద్యులు మరియు ఆరోగ్య యోధులు భయం లేకుండా పనిచేయాల్సి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను సర్కారు వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.
నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం..
దేశంలో కోవిడ్ నివారణ, నియంత్రణ మరియు నిర్వహణను అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రాల సహకారంతో వివిధ చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి సంబంధిత మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు గాను లాక్‌డౌన్ మెరుగైన చర్య అని ఆయన అన్నారు. భవిష్యత్తులో పెరుగనున్న దేశ అవసరాలకు తగ్గట్టుగా మనకు కావాల్సిన వెంటిలేటర్లు, ఎన్95 మాస్కులు, పీపీఈలను ఆర్డరు చేసినట్టుగా మంత్రి తెలిపారు.
(Release ID: 1611459)
Visitor Counter : 151