విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుద్దీపాలు ఆపివేసే సందర్భంలో పవర్ గ్రిడ్ ఆపరేషన్స్ పై తలెత్తే ప్రశ్నలు వాటికి సమాధానాలు గ్రిడ్ అస్థిరతపై ఆందోళనలు అవసరం లేదు

Posted On: 05 APR 2020 5:21PM by PIB Hyderabad

గ్రిడ్ అస్థిరతపై ఆందోళనలు అవసరం లేదు 

ప్రశ్న 1: రాత్రి గంటల నుండి 9.09 గంటల వరకు కేవలం ఇళ్లల్లోనే లైట్లు ఆపివేయాలావీధి దీపాలుఉమ్మడిగా ఉండే ప్రాంగణాలలోనూఅత్యవసరమైన విద్యుద్దీపాలు కూడా ఆపాలా ?

సమాధానం:  మన గౌరవనీయ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు కేవలం ఇళ్లల్లో మాత్రమే లైట్లు ఆపాలి. మిగిలిన లైట్లు కామన్ ఏరియాలోవివీధి దీపాలుఆస్పత్రుల్లో లైట్లు ఏవీ కూడా ఆపకూడదు అని మరో సారి చెబుతున్నాం. 

ప్రశ్న 2: ఇళ్లల్లో విద్యుద్దీపాలు ఆపడం వల్ల మిగిలిన గృహోపకారణాలకు భద్రమేనా

సమాధానం: మీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాలు అన్నీ సురక్షితమే.  ఫ్యాన్లుఏసీలుఫ్రిడ్జిలు ఆపివేయాల్సిన అవసరం లేదు. లోడ్లో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునే వ్యవస్థ భారతదేశంలోని విద్యుచ్ఛక్తి గ్రిడ్ లో ఉంది. అందువల్ల ఇళ్లల్లో అవసరమైన వరకు విద్యుత్ ఉపకరణాల సాధారణ వాడకంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. పూర్తిగా ఈ వ్యవస్థ సురక్షితమే. 

ప్రశ్న 3 : ఏప్రిల్ 5న రాత్రి 9:00 నుండి రాత్రి 9.09 వరకు లైట్ అవుట్ సందర్బంగా గ్రిడ్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు మరియు ప్రోటోకాల్‌లు ఉన్నాయా

సమాధానం:  అవునుగ్రిడ్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి తగిన అన్ని ఏర్పాట్లుప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్‌లు ఉన్నాయి. 

ప్రశ్న 4:  లైట్లు ఆపివేయడం తప్పనిసరా  లేదా స్వచ్ఛందమా

సమాధానం:  స్వచ్ఛందమే. ఇప్పటికే చెప్పినట్లు ఇళ్లల్లో ఉన్న గృహావసరాల దీపాలను మాత్రమే నిలిపివేయాలి.

ప్రశ్న 5: ఇది గ్రిడ్‌లో అస్థిరతకు మరియు విద్యుత్ పరికరాలకు నష్టం కలిగించే వోల్టేజ్‌ హెచ్చుతగ్గులకు కారణమవుతుందని కొన్ని భయాలు వ్యక్తమయ్యాయి?

సమాధానం: ఈ భయాలు పూర్తిగా తప్పు. ఇది సాధారణ దృగ్విషయం. ప్రామాణిక ఆపరేటింగ్ పద్ధతుల ప్రకారం భారమైన విద్యుత్ గ్రిడ్ అటువంటి లోడ్ హెచ్చు తగ్గులుఫ్రీక్వెన్సీ మార్పులను తట్టుకునేలాగే రూపొందించబడింది.

ప్రశ్న 6 : మన గ్రిడ్ నిర్వహణఅమలు చేస్తున్న సాంకేతికత ఈ రాత్రి లైట్లను ఆపివేయడం వల్ల వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకోగలదా? 

సమాధానం: భారతీయ విద్యుత్ గ్రిడ్ దృఢమైనస్థిరమైనఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ఇది ఏ సమయంలో డిమాండ్ నైనాహెచ్చుతగ్గులనైనా  నియంత్రణరక్షణ కలిగి ఉంది.

ప్రశ్న 7 :  ఫ్యాన్రిఫ్రిజిరేటర్లుఎసివంటి ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేయాలా లేదా ఆన్ మోడ్‌లో ఉంచాలా?

సమాధానం: మీ అన్ని గృహోపకరణాలు సురక్షితంగా ఉంటాయి. ఈ ఉపకరణాలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాధారణంగానే ఆపరేట్ చేయాలి. ముఖ్యంగా రాత్రి గంటలకు స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు.

ప్రశ్న 8 : వీధి దీపాలు ఆపేస్తారా?

సమాధానం: లేదుప్రజల భద్రత కోసం వీధి దీపాలను వేసే ఉంచాలని అన్ని రాష్ట్రాలు / యుటిలు / స్థానిక సంస్థలకు సూచించడమైంది.

ప్రశ్న 9: ఆస్పత్రులు లేదా ఇతర అత్యవసర మరియు ముఖ్యమైన ప్రదేశాలు విద్యుద్దీపాలు ఆపుతారా ?

జవాబు: లేదుఆస్పత్రులలో లైట్లు మరియు ప్రజావసరాలున్న ప్రాంతాలుమునిసిపల్ సేవలుకార్యాలయాలుపోలీస్ స్టేషన్లుతయారీ రంగాలు మొదలైన అన్ని అవసరమైన సేవల వద్ద లైట్లు అలాగే ఉంటాయి, ఆగవు. గౌరవనీయ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు- నివాసాలలో లైట్లను మాత్రమే  ఆపివేయమని. 

ప్రశ్న10: గృహాల్లో లైటింగ్ లోడ్ మొత్తం లోడ్లో 20% ఉంది. 20% లోడ్ అకస్మాత్తుగా ఆగిపోతే గ్రిడ్‌ అస్థిరమైపోదామంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

సమాధానం: గృహ విద్యుత్ లోడ్మొత్తం లోడ్ లో 20 శాతం కన్నా తక్కువే. ప్రస్తుతమున్న ప్రామాణిక సాంకేతిక ఆపరేటింగ్ ప్రోటోకాల్‌లు డిమాండ్‌ లో తరుగుదల వచ్చినా సులభంగా ఎదుర్కోవచ్చు. 

ప్రశ్న 11: లోడ్ షెడ్డింగ్  (విద్యుత్ సరఫరా నిలిపివేత) ఉంటుందాఅవును అయితే దాని ప్రభావం ఏమిటి

సమాధానం: లోడ్ షెడ్డింగ్  ఆలోచన లేదు.

***


(Release ID: 1611420) Visitor Counter : 218