ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆహార తయారీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో 2వ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి

Posted On: 05 APR 2020 2:07PM by PIB Hyderabad

ఆహార తయారీ పరిశ్రమ సమస్యలు పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నిటితో నిరంతరం తమ శాఖ సంప్రదింపులు చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. పరిశ్రమ ప్రతినిధుల ప్రధాన సంఘాలైన ఫిక్కీసీఐఐఅసోచామ్పీహెచ్డిసీసీఐ ఇతర సంఘాలతో కేంద్ర మంత్రి 2వ సారి వీడియో కాన్ఫరెన్స్ శనివారం (ఏప్రిల్ 4) నాడు  నిర్వహించారు. లాక్ డౌన్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పునరుత్తేజంతో పనిచేసేలా ప్రభుత్వం తరఫున తీసుకోవలసిన చర్యలకు వీరి నుండి సూచనలను స్వీకరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖకు చెందిన అధికారులుఅంతకు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలపై కేంద్రంరాష్ట్ర స్థాయిలోను తీసుకున్న చర్యలను వివరించారు. 

సూక్ష్మ స్థాయి వరకు ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. వస్తు సరఫరా కొనసాగింపు వ్యవస్థల అనుసంధానంఆహరంఔషధాలు అందుబాటులో ఉండేలా వ్యూహం, ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని అధికారులు చెప్పారు. మొత్తం అందిన 348 సమస్యలలో 50 శాతం పరిష్కరించామనిఇంకా వివిధ స్థాయిలో మిగిలిన సమస్యలు ఉన్నాయని వారు వెల్లడించారు. అనుకున్న చర్యలు క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసాక ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలుపరిస్థితులు సజావుగా సాగేలా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సంఘాల నాయకులూ తగు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.

వలసపోయిన కార్మికులు తిరిగి రావడానికి వీలుగా ప్రత్యేక రైళ్లను నడపాలని పరిశ్రమ ప్రతినిధులు సూచించారు. అలాగే వెంటనే ఉత్పన్నమయ్యే ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను సమీకరించుకోడానికి తగు మూలా ధన మద్దతు ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమ కార్యకలాపాల విషయంలో ఆందోళన ఉందనివాటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

పరిశ్రమ ప్రతినిధులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్వాటి పరిష్కారానికి అన్ని మార్గాలను అనుసరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి మాట్లాడుతూ పరిశ్రమ ప్రతినిధులు లేవనెత్తిన ఈశాన్య రాష్ట్రాల లో సమస్యలను ఆయా రాష్ట్రాలతో కూడా చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని అన్నారు. 

 

****



(Release ID: 1611343) Visitor Counter : 162