పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక మరియు ఆతిథ్య రంగ పరిశ్రమ సంస్థల ప్రతినిధుల్లో పర్యాటక మంత్రిత్వ శాఖ విర్చువల్ సమావేశం
Posted On:
04 APR 2020 5:07PM by PIB Hyderabad
పర్యాటక మరియు ఆతిథ్య రంగానికి చెందిన పరిశ్రమల సంస్థలతో కేంద్ర పర్యాటక శాఖ ఒక విర్చువల్ సమావేశం నిర్వహించింది. మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి పర్యాటక శాఖ కార్యదర్వి శ్రీ యోగేంద్ర త్రిపాఠి ఈ సమావేశం నిర్వహించారు. ఫెయిత్, సిఐఐ, ఫిక్కీ, పి హెచ్ డి సిసి ఐ, ఐఎంఏఐ లాంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. కోవిడ్ -19 వైరస్ కారణంగా పర్యాటక రంగంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే విషయంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో పర్యాటక రంగానికి చెందిన పరిశ్రమలకు ప్రభుత్వం అండగా వుంటుందని అందరూ ఇచ్చిన సూచనలు సలహాలను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. దేశీయంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే సూచన ప్రముఖంగా వినిపించింది.
లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ లాక్ డౌన్ విజయవంతం చేయాలని పర్యాటక శాఖ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రజలను కోరింది. లాక్ డౌన్ ఎత్తేయగానే పర్యటనల్ని కొనసాగించవచ్చని కోరింది.
హోటల్ మేనేజ్ మెంట్ విద్యాసంస్థలకు సంబంధించిన కోర్సు మాడ్యూల్స్ ను ఆన్ లైన్ ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ విద్యాసంస్థలకు సంబంధించిన అధ్యాపకులు, విద్యార్థులు అధునాతన సాంకేతికత ద్వారా తమ కోర్సు ప్రణాళికను కొనసాగించడం జరుగుతోంది.
(Release ID: 1611159)