పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి బలం చేకూర్చిన దేశీయ కార్గో విమానాలు
గత పది రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ వైద్య అవసరాలైన టెస్టింగ్ కిట్లు, మాస్కులు, చేతి గ్లోవ్స్, ఇంకా అనేక వస్తువుల చేరవేత
క్షేత్ర స్థాయిలోను, విధాన పరంగాను నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ చేపట్టడంలో 24X7 కృషి
Posted On:
04 APR 2020 1:58PM by PIB Hyderabad
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధాన స్థాయిలోను, క్షేత్ర స్థాయిలో నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన సరుకులో కోవిడ్ -19 సంబంధిత కారకాలు, ఎంజైములు, వైద్య పరికరాలు, రోగనిర్ధారణ పరీక్షా వస్తు సామగ్రి ఉన్నాయి. అలాగే వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), మాస్కులు, చేతి తొడుగులు (గ్లోవ్స్), హెచ్ఎల్ఎల్ ఇతర ఉపకరణాలు రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కోరిన సరుకు, పోస్టల్ కట్టలు
రవాణా అయ్యాయి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ఐసిఎంఆర్ కేంద్రాలకు అవసరమైన వైద్య సామాగ్రిని పంపిణీ చేయడంతో, ఈ క్రింది ప్రయత్నాలు నెరవేరాయి:
కారకాలు / మెడికల్ కిట్ల పంపిణీ వల్ల రోగులను సకాలంలో పరీక్షించటానికి వీలు కల్పించింది. తద్వారా తదుపరి చర్యలు తీసుకోగలిగారు
డాక్టర్లు అలాగే ఇతర వ్యక్తులు ఈ విమానాల ద్వారా సకాలంలో పంపిణీ అయిన మాస్కులు, చేతి తొడుగులను ఉపయోగించుకోగలిగారు, తమకు తాముగా రక్షణ చర్యలు చేపట్టగలిగారు. ఈశాన్య రాష్ట్రాల మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సామాగ్రిని చేరవేయగలిగారు. తన సేవల ద్వారా దేశంలోని వివిధ దూర ప్రాంతాలకు కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వనరులను మెరుగ్గా వినియోగించుకునే ప్రయత్నం జరిగింది.
తేదీల వారీగా విమానాల ఆపరేషన్లు:
వరుస సంఖ్య
|
తేదీ
|
ఎయిర్ ఇండియా
|
అలయన్స్
|
ఐఏఎఫ్
|
ఇండిగో
|
స్పైస్ జెట్
|
మొత్తం ఆపరేట్ అయినా విమానాలు
|
1
|
26.3.2020
|
02
|
--
|
-
|
-
|
02
|
04
|
2
|
27.3.2020
|
04
|
09
|
01
|
-
|
--
|
14
|
3
|
28.3.2020
|
04
|
08
|
-
|
06
|
--
|
18
|
4
|
29.3.2020
|
04
|
10
|
06
|
--
|
--
|
20
|
5
|
30.3.2020
|
04
|
-
|
03
|
--
|
--
|
07
|
6
|
31.3.2020
|
09
|
02
|
01
|
|
--
|
12
|
7
|
01.4.2020
|
03
|
03
|
04
|
--
|
-
|
10
|
8
|
02.4.2020
|
04
|
05
|
03
|
--
|
--
|
12
|
9
|
03.4.2020
|
08
|
--
|
02
|
--
|
--
|
10
|
|
మొత్తం విమానాలు
|
42
|
37
|
20
|
06
|
02
|
107
|
ప్రయాణించిన మొత్తం దూరం
|
1,02,115 కిలోమీటర్లు
|
ఏప్రిల్ 3వ తేదీ నాడు రవాణా అయిన కార్గో
|
19.39 టన్నులు
|
మొత్తం ఏప్రిల్ 3వ తేదీ వరకు రవాణా అయిన కార్గో
|
119.42 + 19.39 = 138.81 టన్నులు
|
* ఎయిర్ ఇండియా, భారత వైమానిక దళం కలిసి సంయుక్తంగా లడాఖ్, దిమాపూర్, ఇంఫాల్, గాంగ్టక్, గోవాహటి, బాగ్డోగ్ర, చెన్నై, పోర్ట్ బ్లెయిర్ కి సరుకు రవాణా చేశాయి
· లైఫ్ లైన్ ఉడాన్ పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం అయి పని చేస్తుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ (www.civilaviation.gov.in)తో ఇది అనుసంధానమై ఉంది.
అంతర్జాతీయం: షాంఘై ఢిల్లీ మధ్య విమానయానాం నేరుగా అనుసంధానం అయింది. ఈ ఏప్రిల్ 5న ఎయిర్ ఇండియా మొదటి కార్గో విమానం వెళ్తుంది. కీలకమైన వైద్య పరికరాలను రవాణా చేయడం కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను చైనాకు ఒక షెడ్యూల్ ప్రకారం నడుపుతుంది.
ప్రైవేట్ ఆపరేటర్లు – దేశీయ కార్గో ఆపరేటర్లు: బ్లూడార్ట్, స్పైస్‌జెట్, ఇండిగో వ్యాపార పరంగా కార్గో విమానాలను నడుపుతున్నాయి. 2,07,947 కిలోమీటర్ల దూరాన్ని, 1,213.64 టన్నుల సరుకును రవాణా చేసిన స్పైస్‌జెట్ మార్చి 24 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు 153 కార్గో విమానాలను నడిపింది. వీటిలో 44 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 45 దేశీయ కార్గో విమానాలను మార్చి 25 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు 45,783 కిలోమీటర్ల దూరం నడిపి 702.43 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇండిగో 03.4.2020 న 4,871 కిలోమీటర్ల దూరాన్ని 5 కార్గో విమానాలను నడిపి 2.33 టన్నుల సరుకును రవాణా చేసింది.
****
(Release ID: 1611089)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada