PIB Headquarters

కోవిడ్‌-19పై పత్రికా సమాచార సంస్థ (PIB)రోజువారీ సమాచార పత్రం
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్త‌వ త‌నిఖీ చేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

• దేశంలో ఇప్పటిదాకా నిర్ధారిత కేసులు 2,301 కాగా, 56 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలకు ఆటంకం కలిగించవద్దని రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.
• ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు వెలిగించిన కొవ్వొత్తులు, ప్రమిదలతో సంఘీభావం చాటాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
• రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇవాళ కోవిడ్‌-19 ప్రతిస్పందనపై అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెట్‌ గవర్నర్లతో చర్చించారు.
• ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకింద మహిళలఖాతాలకు ఏప్రిల్‌’20కిగాను నగదుబదిలీ

Posted On: 03 APR 2020 7:20PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం

దేశంలో ఇప్పటిదాకా నిర్ధారిత కేసులు 2,301 కాగా, 56 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు 156 మంది వైరస్బారినుంచి కోలుకుని/వ్యాధి పూర్తిగా నయం కావడంతో, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలకు ఆటంకం కలిగించవద్దని రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ముందువరుసన నిలిచి సేవలందిస్తున్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కోవిడ్‌-19కు సంబంధించి మానవ వనరుల వినియోగంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచనపత్రం జారీచేసింది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610844

జాతినుద్దేశించి ప్రదానమంత్రి ప్రసంగం

ప్రధానమంత్రి ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా  దేశవ్యాప్త దిగ్బంధంలో ఒంటరులమని ఏ ఒక్కరూ భావించరాదని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో భాగమైన దిగ్బంధం నడుమ సంపూర్ణ సంఘీభావంతో ఏప్రిల్‌ 5వ తేదీ ఆదివారం.. దేశ ప్రజలంతా రాత్రి 9 గంటలనుంచి 9నిమిషాలపాటు ఇళ్లలోని విద్యుద్దీపాలను ఆర్పివేసి, వెలిగించిన కొవ్వొత్తులు, ప్రమిదలు, మొబైల్‌ ఫ్లాష్‌లైట్లతో వెలుగులు విరజిమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610568

క్రీడా దిగ్గజాలతో ప్రదానమంత్రి చర్చాగోష్ఠి

కరోనాపై పోరాటం దిశగా ప్రజలకిచ్చే సందేశంలో పంచమంత్రాలను జోడించాలని ప్రధానమంత్రి క్రీడా దిగ్గజాలకు సూచించారు. ఈ మేరకు ప్రపంచ మహమ్మారిపై యుద్ధంలో “సంకల్పం”, సామాజిక దూరం పాటింపులో “సంయమనం”, ఆశావాదపూర్వక “సానుకూలత”, వైద్య, పోలీసు సిబ్బందిసహా ముందువరుసన నిలిచి మహమ్మారిపై పోరాడుతున్న వీరులపై “గౌరవం”, జాతీయ-వ్యక్తిగత స్థాయులలో ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళాలద్వారా “సహకారం” అందించేలా ప్రజానీకాన్ని ఉత్తేజపరచాలన్నారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610661

సభలు/సమావేశాలు నిర్వహించవద్దని మత నాయకులకు సూచించాల్సిందిగా గవర్నర్లు/లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి ఆదేశం

కోవిడ్‌-19 సంక్రమణ నిరోధం కోసం నిర్దేశించిన సామాజిక దూరం పాటించాల్సిన అవసరాన్ని మత-ధార్మిక నాయకులకు, వారి అనుయాకులకు స్పష్టం చేయాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఈ మేరకు సభలు, సమావేశాలు నిర్వహించడం తగదని వారికి సలహా ఇవ్వాలని కోరారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో పంటలు ఇళ్లకు చేరేవేళ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, నిల్వ తదితర అంశాలపైనా దృష్టి సారించాల్సిందిగా ఉప రాష్ట్రపతి సూచించారు.

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకింద మహిళల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ

ప్రధానమంత్రి పేదల సంక్షేమ ప్యాకేజీలో భాగంగా 2020 ఏప్రిల్‌ నెలకుగాను పీఎంజేడీవై కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.500 వంతున నేరుగా నగదు జమచేసింది. అయితే, సామాజిక దూరం అనుసరణ దిశగా లబ్ధిదారులు బ్యాంకు శాఖల వద్ద గుమిగూడకుండా క్రమపద్ధతిలో నగదు తీసుకునే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610663

పర్యాటక వీసాలతో భారత్‌లో తబ్లిఘి-జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్న 960మంది విదేశీయులను దేశీయాంగ శాఖ (MHA) నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతోపాటు వారిపై  చట్టపరంగా  తగు చర్యలు తీసుకోనుంది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610512

భారతదేశంలో చిక్కుకున్న విదేశీయులను తిప్పి పంపడం కోసం ప్రామాణిక కార్యాచరణ ప్రక్రియ (SOP) రూపకల్పనకు దేశీయాంగ శాఖ (MHA) అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అలాగే వీరిలో దిగ్బంధ పర్యవేక్షణ చికిత్స పొందుతున్నవారికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించి వైరస్‌ పీడితులు కారని నిర్ధారించాకే పంపుతుంది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610572

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఢిల్లీలోని డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా, సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రులను స్వయంగా సందర్శించి, కోవిడ్‌-19 నియంత్రణ సంసిద్ధతను పరిశీలించడంతోపాటు రోగులతో సంభాషించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610912

కోవిడ్‌-19పై పోరాటానికి కావాల్సిన వైద్య, ఔషధ సరఫరాలకు ఎలాంటి కొరత లేదు

కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్యపరమైన సరఫరాలకు దేశంలో ఎక్కడా, ఎలాంటి కొరత లేదని కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి చెప్పారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610776

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా పౌర అధికార యంత్రాంగంతో చేయికలిపి కృషిచేస్తున్న భారత సాయుధ దళాలు

ముంబై, జైసల్మేర్‌, జోధ్‌పూర్‌, హిండన్‌, మణెసర్‌, చెన్నైలలోని ఆర్మీ స్థావరాల్లో భారత సాయుధ దళాలు ఆరు దిగ్బంధ పర్యవేక్షణ చికిత్స కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కేంద్రాలకు 1,737 మందిని తరలించగా, వారిలో 403 మందికి వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యాక విడుదల చేశారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610691

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి జాతీయ దిగ్బంధం విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరంతరాయ ఆహారధాన్యాల సరఫరాకు భారత ఆహార సంస్థ (FCI) హామీ

ఈ మేరకు ఇవాళ 69 గూడ్సు రైళ్లలో ఆహార ధాన్యాలను నింపారు. దీంతో మార్చి24న జాతీయ దిగ్బంధం ప్రకటించాక నేటిదాకా మొత్తం 477 గూడ్సు రైళ్లద్వారా 13.36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అయ్యాయి. March.https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610732

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చమురు మార్కెటింగ్‌ కంపెనీల జిల్లాస్థాయి నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంటగ్యాస్‌ సిలిండర్ల పంపిణీతోపాటు ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద లబ్ధిదారులకు సరఫరా చేసిన ఉచిత సిలిండర్ల వివరాల గురించి వాకబు చేశారు.  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610740

ఈ-నామ్‌ ఆన్‌లైన్‌ వేదికలో కొత్త అంశాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకారం
జాతీయ వ్యవసాయ విపణి (ఈ-నామ్‌) వేదికకు జోడించిన కొత్త అంశాలను వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు రైతులు నేరుగా టోకు మండీలకు రావాల్సిన అవసరాన్ని తప్పిస్తూ వ్యవసాయ విపణి వేదికను బలోపేతం చేశారు. కోవిడ్‌-19పై పోరును మరింత దృఢం చేయడంలో భాగంగా పంటల విక్రయం కోసం వచ్చే రైతులతో మండీలలో రద్దీ నెలకొనకుండా ఈ వినూత్న చర్యలు చేపట్టారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610403

దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల సంపూర్ణ శుద్ధి కోసం రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ సమర్థ పరికరాలను రూపొందించింది.  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610827

అంకుర సంస్థల ప్రతినిధులతో శ్రీ పీయూష్‌ గోయల్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం
కోవిడ్‌-19 నేపథ్యంలో విధించిన దిగ్బంధం ప్రభావంతోపాటు అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థకు ఎదురైన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆ సంస్థల భాగస్వాములతో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610519

కోవిడ్‌-19 నుంచి ఆరోగ్య సంరక్షణ రంగ వృత్తి నిపుణులకు రక్షణ కోసం రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) అంచులు అతికించగల బయో సూట్‌ను ఆవిష్కరించింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610565

దేశవ్యాప్త దిగ్బంధం ఆంక్షల నుంచి నిర్దిష్ట సేవలకు మినహాయింపు

దేశవ్యాప్త దిగ్బంధం ఆంక్షల నుంచి వ్యవసాయోత్పత్తుల ప్రత్యక్ష విక్రయాలుసహా మినహాయింపు ఇవ్వదగిన నిర్దిష్ట సేవలపై దేశీయాంగ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకూ సమగ్ర వివరాలతో లేఖ రాశారు. ఈ మేరకు ఈ జాబితాలో పిల్లలు, మహిళలు, బాలింతలకు అంగన్‌వాడీలద్వారా ఆహార-పౌష్ఠిక మద్దతు సేవలు, వైద్యసేవలతోపాటు ఆయుష్‌ కేటగిరీకింద ఔషధ తయారీ తదితరాలున్నాయి. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610573

రైల్వే శాఖలో మాస్కులు, హస్త శుభ్రత ద్రవాల తయారీ పెంపు

భారతీయ రైల్వేశాఖ తమ జోనల్‌ రైల్వేల పరిధిలోని సొంత తయారీ యూనిట్లతోపాటు ప్రభుత్వరంగ సంస్థలలో ఏప్రిల్‌ 1వ తేదీదాకా మొత్తం 2,87,704 మాస్కులు, 25,806 లీటర్ల హస్త పరిశుభ్రత ద్రవాన్ని తయారుచేసింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610791

కోవిడ్‌-19పై పోరులో భాగంగా ముంబై ఐఐటీలోని సైన్‌’లో త్వ ప్రతిస్పంద కేంద్రం ఏర్పాటు చేయనున్న డీఎస్టీ  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610787

కరోనాపై భారత్‌ యుద్ధం... దూరదర్శన్‌ వైపు దేశవాసుల దృష్టి

దిగ్బంధం నేపథ్యంలో పురాణేతిహాసాల సుదీర్ఘ సీరియళ్ల పునఃప్రసారంతో దేశవాసులంతా ఇప్పుడు దూరదర్శన్‌-నేషనల్‌, దూరదర్శన్‌-భారతి చానెళ్లపై దృష్టి మళ్లించారు. ఆ మేరకు భారతీయుల హృదయాల్లో జాతీయ ప్రసార మాధ్యమ దిగ్గజంగా తనకుగల స్థానాన్ని  దూరదర్శన్‌ మరోసారి బలంగా చాటింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610515

ప్రధానమంత్రి - మాననీయ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి మోదీ ఇటీవల మాననీయ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 ప్రస్తుత పరిణామాలపై ఈ సందర్భంగా వారిద్దరూ చర్చించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610566

ప్రధానమంత్రి – జర్మనీ సమాఖ్య చాన్సలర్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి మోదీ ఇటీవల జర్మనీ సమాఖ్య చాన్సలర్‌ మాననీయ డాక్టర్‌ ఏంజెలా మెర్కల్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. రెండు దేశాల్లోనూ ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 ప్రస్తుత పరిణామాలపై దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఈ ఆరోగ్య సంక్షోభంపై పోరాటానికి అంతర్జాతీయ సహకారానికిగల ప్రాముఖ్యంపైనా వారు మాట్లాడుకున్నారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610525

కోవిడ్‌-19పై పోరు దిశగా సంబంధిత తొలి ఆమోదిత ప్రాజెక్టులతోపాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై శాస్త్ర సాంకేతిక విజ్ఞానశాఖ, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డులద్వారా ప్రకటన జారీ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610533

పర్యాటకులకు, పర్యాటక పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేస్తున్న ఆరోగ్య సంబంధిత సమాచారం, ఇతర మార్గదర్శకాలను పర్యాటక మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా వారికి అందేవిధంగా నిర్దిష్ట చర్యలు తీసుకుంటోంది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610615

విద్యుత్‌-పునరుత్పాదక ఇంధనరంగంలోని ప్రభుత్వరంగ సంస్థలు ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.925 కోట్ల విరాళం అందజేస్తున్నాయి. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610742

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సమగ్ర చర్యల్లో భాగంగా భారతీయ రైల్వేలు తమ యంత్రాంగం మొత్తాన్నీ భారీస్థాయిలో ఈ దిశగానే కేంద్రీకరించాయి.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610830

కోవిడ్‌-19 ముప్పునుంచి సురక్షితంగా ఉండటం గురించి యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ, ఎన్‌ఐఓఎస్‌, ఎన్‌సీఈఆర్‌టీ, కేవీఎస్‌లకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది.   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610735

జాతీయ దిగ్బంధం పటిష్ట అమలులో భాగంగా ఈశాన్య ప్రాంత అంతర్జాతీయ సరిహద్దు (దాదాపు 5,500 కి.మీ) సమగ్రంగా మూసివేయబడింది: కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610739(Release ID: 1610866) Visitor Counter : 58