రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో వైద్య అవసరాలకు ఏ కొరత లేదు : కేంద్ర మంత్రి గౌడ

प्रविष्टि तिथि: 03 APR 2020 4:22PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తిపై పోరాడటానికి దేశవ్యాప్తంగా వైద్య సామాగ్రికి కొరత లేదని కేంద్ర రసాయనఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద్ గౌడ అన్నారు. నిత్యావసర వైద్య సరఫరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని శ్రీ గౌడ ట్వీట్ చేశారు. గత రోజుల్లో 62 ఉడాన్ విమానాలు 15.4 టన్నుల వైద్య సామాగ్రిని రవాణా చేశాయని తెలిపారు. అలాగే కార్గో విమానాలు గత రోజుల్లో 10 టన్నుల వైద్య పరికరాలను దేశవ్యాప్తంగ రవాణా చేశాయని కేంద్ర మంత్రి శ్రీ గౌడ వెల్లడించారు.

ఫార్మాస్యూటికల్స్హాస్పిటల్ పరికరాల వంటి అవసరమైన వస్తువుల తయారీ కార్యకలాపాలపై కూడా ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోందని ఆయన ఉద్ఘాటించారు. దీని కోసం సెజ్ లలో  200 కి పైగా యూనిట్లు పనిచేస్తున్నాయి. అవసరమైన వైద్య వస్తువుల పంపిణీని నిశితంగా పరిశీలించడానికి మరియు లాజిస్టిక్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీ గౌడ తెలియజేశారు.

                                                                                ******


(रिलीज़ आईडी: 1610776) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam