విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్తు & పునరుత్పాదక రంగానికి చెందిన పి.ఎస్.యు.లు ప్రధానమంత్రి కెర్స్ నిధి కి రూ.925 కోట్ల విరాళం.

Posted On: 03 APR 2020 3:49PM by PIB Hyderabad

కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి బాధితులకు సహాయం అందించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన " ప్రధానమంత్రి పౌరుల అత్యవసర పరిస్థితుల సహాయ, ఉపశమన నిధి" (పి.ఎమ్.కెర్స్ నిధి) కి విద్యుత్తు శాఖ  మరియు కొత్త & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు (సి.పి.ఎస్.ఈ.లు) 925 కోట్ల రూపాయలు విరాళంగా అందజేయాలని నిర్ణయించాయి. 

తన మంత్రిత్వ శాఖల్లోని పి.ఎస్.యు.లు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం గురించి విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక శక్తి శాఖల కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ ఒక ట్వీట్ చేస్తూ -  "  విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు 925 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి కెర్స్ నిధికి విరాళంగా అందజేయాలని నిర్ణయించారని తెలియజేయడాన్ని  మేము గౌరవంగా భావిస్తున్నాము.  ఈ మొత్తంలో 445 కోట్ల రూపాయలను మార్చి నెల 31వ తేదీన జమ చేయడం జరిగింది. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ నెల మొదటి వారంలో జమ చేయడం జరుగుతుంది.  మొత్తం 925 కోట్ల రూపాయలలో 905 కోట్ల రూపాయలు విద్యుత్ మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, 20 కోట్ల రూపాయలు ఎమ్.ఎన్.ఆర్.ఈ. కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు విరాళంగా అందజేశాయి." అని తెలియజేశారు.  

కోవిడ్-19, దాదాపు మొత్తం ప్రపంచాన్ని కబళించిన అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి.   ఈ మహమ్మారి భారత దేశంలో కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తోంది, దీన్ని ఎదుర్కోడానికి మొత్తం దేశం కలిసి నిలబడాలి." అని శ్రీ ఆర్.కే. సింగ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తికి స్పందించి, ప్రధానమంత్రి కెర్స్ నిధికి, హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 

విరాళాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

అంకెలు కోట్ల రూపాయలలో..... 

విద్యుత్ మంత్రిత్వ శాఖ, సి.పి.ఎస్.ఈ. ల ద్వారా

ప్రధానమంత్రి కెర్స్ ఖాతా లో విరాళం వివరాలు  



క్రమ సంఖ్య 

 

 

సి.పి.ఎస్.ఈ. 

పేరు 

 

 

31మార్చి,2020 

వరకు విరాళం 

2020-21

సి.ఎస్.ఆర్. బడ్జెట్ నుండి జమ చేయాలని ప్రతిపాదించిన మొత్తం 

 

 

ఉద్యోగుల 

జీతం నుండి విరాళాలు 

 

 

 

మొత్తం 

1.    

ఎన్.టి.పి.సి. 

 - నిల్ - 

250

7.5

257.50

2.    

పి.జి.సి.ఐ.ఎల్. 

130

70

2.47

202.47

3.    

పి.ఎఫ్.సి. 

181

19

0.18

200.18

4.    

ఆర్.ఈ.సి. లిమిటెడ్ 

100

50

0.15

150.15

5.    

ఎన్.హెచ్.పి.సి. 

20

30

1.9

51.90

6.    

ఎస్.జె.వి.ఎన్. లిమిటెడ్ 

5

20

0.32

25.32

7.    

టి.హెచ్.డి.సి. 

2.0

7.4

0.60

10.00

8.    

బి.బి.ఎమ్.బి 

   - నిల్ -      - నిల్ -  

2.5

2.50

9.    

పి.ఓ.ఎస్.ఓ.సి.ఓ. 

0.27

0.3

0.17

0.74

10.             

ఎన్.ఈ.ఈ.పి.సి.ఓ. 

2.56

1.50

0.60

4.66

 

 

440.83

448.20

16.39

 

మొత్తం 

905.42

 

 

 

                                                                                     అంకెలు కోట్ల రూపాయల్లో ....  

నూతన & పునరుత్పాదక మంత్రిత్వ శాఖ,

సి.పి.ఎస్.ఈ. ల ద్వారా పి.ఎమ్.కేర్స్ ఖాతాలో విరాళం   


క్రమ సంఖ్య 
 

సి.పి.ఎస్.ఈ.  పేరు  

 

మొత్తం విరాళం

(సి.ఎస్.ఆర్.+జీతం) 

 

1.

ఐ.ఆర్.ఈ.డి.ఏ. 

15

2.

ఎస్.ఈ.సి.ఐ. 

5

                                     మొత్తం 

20



(Release ID: 1610742) Visitor Counter : 218