హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 నిరోధానికి విధించిన లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌నుంచి కొన్ని ప్ర‌త్యేక సేవ‌ల మిన‌హాయింపు

Posted On: 02 APR 2020 9:40PM by PIB Hyderabad

కోవిడ్ 19 మ‌హ‌మ్మారిని నివారించ‌డానికిగాను దేశ‌వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌గానే దీనికి సంబంధించి ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర హోమ్ శాఖ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వీటినుంచి కొన్ని ప్ర‌త్యేక సేవ‌ల‌ను మిన‌హాయించాల‌నే విజ్ఞ‌ప్తులు వ‌చ్చాయి. వీటికి సంబంధించి నిర్ణ‌యం తీసుకున్న హోం శాఖ నిబంధ‌న‌ల‌నుంచి మిన‌హాయింపు ల‌భించిన సేవ‌ల వివ‌రాల‌ను ఆయా రాష్ట్రాల‌కు తెలిపింది. 
లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌నుంచి మిన‌హాయింపు పొందిన సేవ‌లు ఏవంటే..
1. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప్ర‌త్య‌క్ష విక్ర‌యాలు 
2. పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు, బాలింత‌ల‌కు అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు అందించే ఆహారం మ‌రియు పోష‌కాల సేవ‌లు
3. ఆయుష్ విభాగం కింద అందించే వైద్య ఆరోగ్య సేవ‌లు మ‌రియు మందుల త‌యారీ 
*****



(Release ID: 1610573) Visitor Counter : 111