హోం మంత్రిత్వ శాఖ

త‌బ్లిమ్ జామాత్ కార్య‌క‌లాపాల‌తో సంబంధం ఉన్న 960 మంది విదేశీయుల టూరిస్ట్ విసాలు బ్లాక్లిస్టులోకిః హోంశాఖ‌

అవ‌స‌ర‌మైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న

Posted On: 02 APR 2020 7:38PM by PIB Hyderabad

త‌బ్లిమ్ జామాత్ కార్య‌క‌లాపాల‌తో సంబంధం ఉండి ప్ర‌స్తుతం భార‌త్‌లో ఉంటున్న దాదాపు 960 మంది విదేశీయుల టూరిస్టు వీసాల‌ను కేంద్ర హోంశాఖ బ్లాక్‌లిస్టులో చేర్చింది. దీనికి తోడు విదేశీయుల చట్టం, 1946 మరియు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం, ఉల్లంఘనదారులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ అన్ని సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర‌పాలిక కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన డీజీపీలను, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌రును కేంద్ర హోం శాఖ ఆదేశించింది.


(Release ID: 1610512) Visitor Counter : 205