రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స‌ముద్రంలో చిక్కుకున్న మ‌త్స్య‌కారుల‌ను ఆదుకున్న భారత నావికాదళం

అప‌ద‌లో ఉన్న జాల‌రులకు సాయ‌మందించిన 'ఐఎన్ఎస్ నిరీక్ష‌క్‌'

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2020 6:32PM by PIB Hyderabad

 కొచ్చి కేంద్రంగా ప‌ని చేస్తున్న స‌ద‌ర‌న్ నావ‌ల్ క‌మాండ్‌కు చెందిన ఐఎన్ఎస్ నిరీక్ష‌క్ యుద్ధనౌకలోని సిబ్బంది అరేబియా స‌ముద్రంలో నిరాధారంగా చిక్కుకుపోయిన త‌మిళ‌నాడుకు చెందిన 10 మంది మత్స్యకారులను ఆదుకున్నారు. కేర‌ళ తీరం వెంబ‌డి మిష‌న్ పెట్రోలింగ్‌లో ఉన్న ఈ యుద్ధ నౌకలోని అధికారులు గ‌స్తీ నిర్వ‌హిస్తుండ‌గా త‌మిళ‌నాడుకు చెందిన చేప‌ల వేట బోటు 'సెయింట్ నికోల‌స్‌'లో 10 మంది మ‌త్స్య‌కారులు చిక్కుకొని ఉండ‌డాన్ని గ‌మ‌నించింది. ఈ స‌ముద్రంలోని ప‌డ‌వ‌లో ఉండి పోయిన మ‌త్స్యకారులు త‌గిన ఇంధ‌నం గానీ.. తాగేందుకు నీళ్లు గానీ లేక ఇబ్బంది ప‌డుతున్న విష‌యాన్ని నావికాద‌ళం సిబ్బంది గుర్తించింది. మ‌త్స్య‌కారులు ఆప‌ద‌లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన ఐఎన్ఎస్ నిరీక్ష‌క్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌డ‌వ‌లోని జాల‌రులు తిరిగి త‌మ సొంత పోర్టును చేరేందుకు వీలుగా దాదాపు 300 లీట‌ర్ల ఇంధ‌నాన్ని, స‌రిప‌డా తాగు నీరును అందించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నెల‌కొన్న ప్ర‌స్తుత త‌ర‌ణంలో ఆరోగ్య శాఖ‌ సూచ‌న‌ల మేర‌కు ప‌డ‌వ‌లోని మ‌త్స్య‌కారుల‌తో ఎలాంటి ప్ర‌త్య‌క్ష స్ప‌ర్ష లేకుండా నౌక‌లోని అధికారులు జాగ్ర‌త్త ప‌డ్డారు. మ‌త్స్య ప‌డ‌వ‌లోని వారికి ఇంధ‌నాన్ని, తాగు నీటిని ఐఎన్ఎస్ నిరీక్ష‌క్ నౌక‌లో ఉన్న‌ క్రేన్ ద్వారా సాయం అందించారు. సెయింట్ నికోల‌స్ ప‌డ‌వ‌లో మ‌త్స్య‌కారులు మార్చి 12న చేప‌ల వేట కోసం ఆరేబియ‌న్ స‌ముద్రంలోకి వెళ్లారు. ఆ త‌రువాత ఈ ప‌డ‌వ‌లోని వారు మ‌రింత ఇంధనం ఇత‌ర రేష‌న్ నిమ‌త్తం కొచ్చికి వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌రోనా లాక్డౌన్ కొన‌సాగుతున్న కార‌ణంగా వారికి త‌గిన సాయం ల‌భించ‌లేదు. దీంతో వారు స‌ముద్రంలోనే చిక్కుకుపోయారు. ఐఎన్ఎస్ నిరీక్ష‌క్ సాయంతో వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 


(రిలీజ్ ఐడి: 1610451) సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil