పర్యటక మంత్రిత్వ శాఖ

పర్యాటక మంత్రిత్వ శాఖ వారి ’స్ట్రాండెడ్ ఇన్ ఇండియా’ పోర్టలుకు సహాయం కోరుతూ విదేశీ పర్యాటకుల నుండి రెండు రోజుల్లో 500కు పైగా ప్రశ్నలు/అభ్యర్థనలు

Posted On: 02 APR 2020 4:24PM by PIB Hyderabad

భారత్లో చిక్కుకున్న విదేశీ పర్యాటకుల సహాయార్థం 31 మార్చి 2020న భారత ప్రభుత్వం ’స్ట్రాండెడ్ ఇన్ ఇండియా’ పోర్టల్ను  ప్రారంభించింది. ఈ పోర్టల్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే  సహాయం కోరుతూ 500 పైగా ప్రశ్నలు/అభ్యర్థనలు వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర అధికారులను సమన్వయ పరుచుకుని దేశంలో చిక్కుకు పోయిన విదేశీయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో వారి సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. విదేశీయు దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో వారి దేశ రాయబార కార్యాలయాలతో కూడా విదేంశాంగ శాఖ చర్చలు జరుపుతున్నది.

దేశంలో చిక్కుకున్న విదేశీయుల నుండి వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళే విషయంలో మరియు వెళ్ళలేని పక్షంలో వారి వీసా గడువు పొడింగింపు విషయమై ఎక్కువగా ప్రశ్నలు/అభ్యర్థనలు వస్తున్నాయి.

విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఎదుర్కొంటున్న మరొక సమస్య ఢిల్లీ మరియు ముంబై వంటి మెట్రో నగరాలకు వారు చేరుకోడం. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత వారికి ఆయా నగరాల నుండి మాత్రమే వారి స్వదేశాలకు వెళ్ళడానికి విమాన సౌకర్యం ఉండడం వలన వారు ఈ విషయంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ విషయాలలో వారి సమస్యలను పరిష్కరించడానికి పర్యాటక  మంత్రిత్వ శాఖ వారు రాష్ట్రాల అధికారులతో క్రియాశీల చర్చలు జరుపుతున్నారు. వయోజన విదేశీ పర్యాటకులకు అత్యవసరాలైన ఆహారం, ఔషధాలు వంటి విషయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నది.

పర్యాటక మంత్రిత్వ శాఖ వారి హోటళ్ళు మరియు రెస్టారెంట్ల విభాగం విదేశీ పర్యాటకులు బసచేసిన కొన్ని హోటళ్ళతో నిరంతరం సమాచార సంబంధాలను కలిగి ఉన్నది, అట్లే వారు ఈ లాక్డౌన్ సమయంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లైతే వారి దేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయపరచుకొని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ పర్యాటకులు వారి రాయబార కార్యాలయాలు వారి తిరుగు ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసేవరకు హోటళ్ళ వారి సహకారాన్ని మరియు ప్రొటోకాల్ పాటించాలని అభ్యర్థిస్తున్నది పర్యాటక శాఖ.

పర్యాటక శాఖ అధికారులు, కేంద్ర మరియు ప్రాంతీయ స్థాయిల్లోని అధికారులు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతినిధులతో ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకుల సమస్యలను తక్కువ సమయంలో పరిష్కారానికి ప్రయత్నిస్తున్నది. ఈ సమన్వయ బృందం వాట్సప్, ఇ-మెయిళ్ళు మరియు టెలిఫోన్ల ద్వారా సమాచారం వేగంగా తెలుసుకోవడానికి అలాగే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నది.

24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే 1363  టెలిఫోన్ హెల్పైన్ను పర్యాటక శాఖ నిర్వహిస్తున్నది ఈ హెల్పైన్ ద్వారా పర్యాటకులు తాజా సమాచారాన్ని పొందవచ్చు.

మరింత సమాచారానికై strandedinindia.com లేదా  incredibleindia.org .లను సందర్శించండి

 


(Release ID: 1610434) Visitor Counter : 137