హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా అమలౌతున్న లాక్ డౌన్ చర్యల ఉల్లంఘించినకు సంబంధించి చట్టపరమైన చర్యలకు విస్తృత ప్రచారం కల్పించాలని హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.
లాక్ డౌన్ చర్యలను ఉల్లఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
प्रविष्टि तिथि:
02 APR 2020 4:29PM by PIB Hyderabad
మంత్రిత్వ శాఖలు / భారత ప్రభుత్వ విభాగాలు / రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు / పాలనా యంత్రాంగాలు, దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలనే ఉద్ద్యేశ్యంతో చేపడుతున్న లాక్ డౌన్ చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎమ్.హెచ్.ఏ.) ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది.
కోవిడ్-19 వ్యాప్తిని సమర్ధంగా అరికట్టడానికి చేపట్టిన లాక్ డౌన్ చర్యలను, విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద తమ అధికారాలను ఉపయోగించి, తు.చ. తప్పకుండా ఖచ్చితంగా అమలుచేయాలని కోరుతూ హోంమంత్రిత్వ శాఖ ఇంతకు ముందు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
అవే ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, అన్ని రాష్ట్రాలకు లేఖలు వ్రాశారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన లాక్ డౌన్ చర్యలను ఉల్లంఘిస్తే, విపత్తు నిర్వహణ చట్టం మరియు భారతీయ శిక్షా స్మృతి కింద విధించే చట్టపరమైన శిక్షలపై అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వుల్లో అన్ని రాష్ట్రాలను కోరారు. లాక్ డౌన్ చర్యలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
రాష్ట్రాలకు జారీ చేసిన సమాచారం వివరాలు ఇక్కడ చూడండి :
చట్టపరమైన నిబంధనలు ఇక్కడ చూడండి :
*****
(रिलीज़ आईडी: 1610384)
आगंतुक पटल : 261