ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆరోగ్యసేతు: బహుముఖ ప్రయోజనాల వారధి

ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ –ప్రైవేట్ భాగస్వామ్యంలో నూతన యాప్ (అనువర్తనం)ను విడుదల చేసిన భారత ప్రభుత్వం

Posted On: 02 APR 2020 4:21PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో, ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో భాగంగా ప్రజలందరినీ ఏకతాటి మీదకు తీసుకువచ్చే ఉద్దేశంతో ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యంలో భారత ప్రభుత్వం ఓ బహుముఖ ప్రయోజనాలతో కూడిన యాప్ (అనువర్తనం) ను విడుదల చేసింది.

ఆరోగ్యసేతు పేరుతో రూపొందించిన ఈ యాప్ డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి భారతీయుడి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహాయపడుతుంది. కరోనా వైరస్ సంక్రమణను తెలుసుకుని, ప్రజలు స్వీయ అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అత్యాధునిక బ్లూటూత్ టెక్నాలజీ, అల్గారిథం, మరియు కృత్రిమ మేథస్సు ఆధారంగా ఇతరులతో మన పరస్పర చర్యల ఆధారంగా లెక్కిస్తుంది.

సులభ వినియోగం మరియు యూజర్ ఫ్రెండ్లీ అయిన ఈ యాప్ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత, ఆ ఫోన్ సమీపంలో ఉన్న ఆరోగ్య సేతు ఇన్ స్టాల్ అయిన ఇతర పరికరాల దూరాన్ని తదితర అంశాలను లెక్కిస్తుంది. వీటిలో దేనినైనా తెలుసుకోవడం ద్వారా అధునాతన పారామితుల ఆధారంగా వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని లెక్కిస్తుంది.

కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తి ప్రమాదాన్ని అంచనా వేయడంతో పాటు అవసరమైన చోట నిర్బంధం విషయంలో సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ సహాయపడుతుంది.

ఈ యాప్ లో గోప్యతకు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఇది సేకరించిన వ్యక్తిగత డేటా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రహస్యంగా ఉంచబడుతుంది. వైద్య సహాయాన్ని సులభతరం చేయడానికి ఆవసరమైనంత వరకు ఫోన్ లో భద్రంగా ఉంటుంది.

11 భాషల్లో లభించే ఈ యాప్, మొదటి రోజు నుంచి పాన్ – ఇండియా ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది. అంతే కాకుండా హైలీ స్కేలబుల్ ఆర్కిటెక్చర్ ను కలిగి ఉంది.

భారతదేశ యువత ప్రతిభను ఒక చోట చేర్చి సరైన వనరులను అందించగలిగితే, సంక్షోభ సమయాల్లో వారు ప్రతిస్పందించే ప్రయత్నాలను ఇదో ప్రత్యేక ఉదాహరణ. ఇది ఒకేసారి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య సేవల పంపిణీ, వ్యాధి రహిత దేశం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా యువ భారతాన్ని ఏకం చేసే వారధి.

 

మై సురక్షిత్... హమ్ సురక్షిత్... భారత్ సురక్షిత్...

నేను సురక్షితం... మేము సురక్షితం... భారతదేశం సురక్షితం...(Release ID: 1610372) Visitor Counter : 273