రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి సిద్ధమైన మాజీ సైనికులు

’వ్యక్తి కంటే ముందు సేవ’ అనే సూత్రంతో ముందుకు వస్తున్న మాజీ సైనికులు

Posted On: 02 APR 2020 10:25AM by PIB Hyderabad

కొవిడ్-19పై దేశం అలుపెరుగకుండా పోరాడుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో దేశ రక్షణ మంత్రిత్వ శాఖ  అధ్వర్యంలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ(ఇఎస్డబ్ల్యూ) మాజీ సైనికుల సేవలను రాష్ట్రాలు, జిల్లాల్లో అవసరమైన చోట వినియోగించుకునేందుకు నిర్ణయించుకుంది.

వీలైనంత గరిష్టంగా మాజీ సైనికులను స్వచ్ఛందంగా రాష్ట్ర మరియు జిల్లా యంత్రాంగాలకు కొవిడ్-19 సోకిన  వారిని గుర్తించడం, సామాజిక నిఘా, క్వారంటైన్ సౌకర్యాల పర్యవేక్షణ, యాజమాన్యం లేదా వారికి నిర్దేశించిన పనుల్లో సహకారం అందించడానికి  రాజ్య సైనిక బోర్డులు, జిల్లా సైనిక బోర్డులు క్రియాశీల పాత్రను వహిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల రిత్యా ’వ్యక్తి కంటే ముందు సేవ’ అనే సూత్రంతో ప్రభుత్వం నుంచి అందుకున్న పిలుపు మేరకు ఈ మహమ్మారిపై పోరాటానికి మాజీ సైనికులు సిద్ధమయ్యారు. క్రమశిక్షణ, ప్రేరణ పొందిన మరియు మంచి శిక్షణ పొంది ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించగల నేర్పు, ధృడమైన వ్యక్తిత్వం కల మాజీ సైనికులు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను మరియు గ్రామాల్లోనూ ఉన్నారు.
 

పంజాబ్ రాష్ట్రంలో ’గార్డియన్స్ ఆఫ్ గవర్నెన్స్’ అనే సంస్థగా ఏర్పడిన సుమారు 4,200 మంది మాజీ సైనికులు ఇప్పటికే వివిధ గ్రామాల నుండి సమాచార సేకరణ కార్యక్రమంలో నిమగ్నమైయున్నారు. పోలీసులకు అవసరమైన సహకారం అందించడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొంత మంది మాజీ సైనికులను ఇప్పటికే రంగంలోనికి దింపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాల కలెక్టర్లు మాజీసైనికుల స్వచ్ఛంద సేవలను వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో జిల్లా సైనిక్ కల్యాణ్ అధికారీలు జిల్లా కంట్రోల్ రూం వారితో అవసరమైన సహకారం అందించడానికి తయారుగా ఉండగా పదవీ విరమణ పొందిన ఆర్మీ మెడికల్ సైనికదళం సిబ్బందిని గుర్తించి తయారుగా ఉంచారు. అవసరమైతే ఐసోలేషన్ సెంటర్లుగా వినియోగించుకునేందుకు సైనిక విశ్రాంతి గృహాలను అవసరానికి తగిన విధంగా తయారు చేసి ఉంచారు. గోవాలో స్థానిక యంత్రాంగానికి అవసరమైతే తగిన సహాయ సహకారాలు అందించేందుకు మాజీ సైనికులతో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి తయారుగా ఉంచారు.

 


(Release ID: 1610184) Visitor Counter : 191