సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీఐబీ నుంచి కోవిడ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పోర్టల్
ప్రతిరోజు రాత్రి ఎనిమిదింటికి కోవిడ్ సమగ్ర వివరాలతో ప్రత్యేక బులిటెన్
Posted On:
01 APR 2020 10:12PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలకు కచ్చితమై సమాచారాన్ని అందించేందుకు గాను ప్రెస్ ఇన్ఫర్‌మెషన్ బ్యూరో (పీఐబీ) ముందుకు వచ్చంది. కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో మెయిల్ ద్వారా సమాచారాన్ని స్వీకరించి వాటికి సమాధానాల్ని త్వరితగతిన అందించనున్నారు. దీనికి తోడు పీఐబీ కోవిడ్-19 విషయమై సమగ్ర సమాచారంతో ప్రతిరోజు ప్రత్యేక బులిటెన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ బులిటెన్‌లో కరోనా విషయమై దేశంలో పురోగతి విషయాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు, తాజా పరిణామాల సమాచారాన్ని ఇందులో అందించునున్నారు. తొలి బులిటెన్ బుధవారం పీఐబీ విడుదల చేసింది. దీనికి అదనంగా కోవిడ్-19కు సంబంధించి టెక్నికల్ అంశాలపై ప్రజల్లో ఏర్పడే సందేహాలకు సరైన సమాధానం ఇచ్చేందుకు గాను ఎయిమ్స్ నకు చెందిన వైద్య నిపుణులతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ టెక్నికల్ గ్రూపును ఏర్పాటు చేసింది. దీనికి తోడు వలస వచ్చిన వారిలో మానసిక అందోళనలను దూరం చేసేందుకు గాను మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. COVID 19 నిర్వహణలో వివిధ అంశాలపై నిర్ణయం తీసుకోవటానికి వీలుగా స్పష్టమైన ఆదేశాలతో విపత్తు నిర్వహణ చట్టం క్రింద 11 సాధికారికత సమూహాలను ఏర్పాటు చేయడాన్ని తెలియజేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాబినెట్ కార్యదర్శి బుధవారం ఒక లేఖ రాశారు. ఇలాంటి సాధికారికత సమూహాలను రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని ఈ లేఖలో క్యాబినెట్ కార్యదర్శి కోరారు. వలసదారుల సంక్షేమ కార్యక్రమాలను పర్వవేక్షించేందుకు గాను వాలంటీర్లను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
(Release ID: 1610133)
Visitor Counter : 171