సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వ్యాప్తి తరువాత ప్రజల ఫిర్యాదులు మరియు సూచనల మేరకు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005 ప్రకారం 10 మంది అధికారుల సాధికార బృందం నిర్ణయాలు తీసుకుంది
Posted On:
31 MAR 2020 3:57PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి కట్టడికి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు మరియు సూచనల మేరకు స్పందించి చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005 ప్రకారం 10 మంది అధికారుల సాధికార బృందం 2020 మార్చి 31న సమావేశమై సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం మరియు వాటిని వివరించి తదనుగుణంగా వ్యూహరచన చేసి కాలాతీతం కాకుండా నిర్ణయాల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని బృందం నిర్ణయించింది. సమావేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజల ఫిర్యాదుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఛత్రపతి శివాజీ, హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీ ఆశుతోష్ అగ్నిహోత్రి, కేబినేట్ సేక్రెటేరియట్ లో డైరెక్టర్ శ్రీమతి మీరా మోహంతి మరియు ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి అందిన వివిధ రకాల ఫిర్యాదులకు అనుగుణంగా అధికారుల సాదికార బృందం ఇందుకు సంబందించిన సూచనలను, వివిధ పనులు చేయడానికిగాను కాల వ్యవధిని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించడానికి మార్గదర్శకాలను రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపుతుంది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ పోర్టల్ లో ఉంచడం జరుగుతుంది. కోవిడ్ -19 ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమిస్తుంది. కోవిడ్ -19 కేసుల పరిష్కార గతిని ప్రతిశాఖ గమనిస్తుంటాయి. ఫిర్యాదులను మూడు రోజుల లోపల పరిష్కరించాలని నిర్దేశించారు.
అదేవిధంగా పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజల ఫిర్యాదుల శాఖ అయిదుగురు అధికారులతో ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా ఈ శాఖ కూడా అధికారుల సాదికార బృందం వలె రాష్ట్రాలకు ఇదే విధమైన మార్గదర్శకాలను జారీచేస్తుంది. కోవిడ్-19 వ్యాధి కట్టడికి సంసిద్దత గురించి ఈ శాఖ పంపిన 23 అంశాల ప్రశ్నావళికి 266 మంది అయిదేళ్లకు పైగా అనుభవం గల ఐఏఎస్ అధికారుల జవాబుల ఆధారంగా జిల్లాల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
కోవిడ్ -19 పై తీసుకోవలసిన చర్యల గురించి ప్రజల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి 46000 పైగా సూచనలు అందాయి.
(Release ID: 1609777)
Visitor Counter : 162