రైల్వే మంత్రిత్వ శాఖ

మొత్తం 20,000 బోగీలను మార్చడానికి భారతీయ రైల్వేలు సిద్ధంగా ఉన్నాయి; వీటిలో ఐసోలేషన్ అవసరాలకు అనుగుణంగా 3,20,000 వరకు పడకలను ఏర్పాటు చేస్తారు.

కోవిడ్-19 రోగుల అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ ఐసోలేషన్ బోగీలను రూపొందిస్తారు.



ముందుగా సుమారు 80,000 పడకలకు సరిపోయే 5,000 బోగీలను సిద్ధం చేస్తారు.



వివిధ జోన్లలో ఈ బోగీలను సిద్ధం చేస్తారు.

Posted On: 31 MAR 2020 2:59PM by PIB Hyderabad

కోవిడ్-19 సంసిద్ధతలో భాగంగా, దేశంలో క్వారంటైన్ సౌకర్యాలను పెంపొందించడానికి, 20000 బోగీలను క్వారంటైన్ / ఐసోలేషన్ బోగీలుగా మార్పు చేయాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.  ఈ నేపథ్యంలో, సాయుధ దళాల వైద్య సేవలు, వివిధ జోనల్ రైల్వేలకు చెందిన వైద్య విభాగాలు, భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోని ఆయుష్మాన్ భారత్ శాఖ లతో సంప్రదింపులు చేయడం జరిగింది.   ఐదు రైల్వే జోన్లు ఇప్పటికే క్వారంటైన్ / ఐసోలేషన్ బోగీల నమూనాలను తయారుచేసాయి. 

 

 

ఈ విధంగా మార్పుచేసిన 20,000 బోగీలలో ఐసోలేషన్ అవసరాల కోసం 3,20,000 వరకు పడకలు ఉంటాయి.   మొదటి దశలో భాగంగా,  5000 బోగీలను క్వారంటైన్ / ఐసోలేషన్ బోగీలుగా మార్పుచేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.  ఈ 5000 బోగీలు 80000 పడకల వరకు ఉండే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.  ప్రతి బోగీలోనూ ఐసోలేషన్ కోసం 16 పడకలు ఉండే అవకాశం ఉంది. 

 

 

క్వారంటైన్ / ఐసోలేషన్ బోగీలుగా మార్చడానికి కేవలం నాన్-ఏ.సి. స్లీపర్ బోగీలను మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు.  భారతీయ విధానంలో ఉన్న ఒక మరుగు దొడ్డిని స్నానాల గదిగా మారుస్తారు.  ఈ గదిలో ఒక బకెట్, ఒక మగ్గుతో పాటు ఒక సబ్బు కూడా ఉంచుతారు.  వాష్ బేసిన్లలో పైకి లేపితే నీరు వచ్చే పద్దతి గల కుళాయిలను అమర్చుతారు.  బకెట్ లో నీరు నింపుకోడానికి వీలుగా ఉండే ఎత్తులో అదే విధమైన మరొక కుళాయిని అమర్చుతారు. 

 

 

బాత్ రూమ్ దగ్గర్లో ఉండే మొదటి కేబిన్ కు రెండు ఆసుపత్రి / ప్లాస్టిక్ తెరలను అమరుస్తారు. బోగీలోని ఎనిమిది పడకల క్యాబిన్ల లోకి వచ్చే, పోయేవారు కనబడే విధంగా వీటిని అమరుస్తారు.   ఈ మొదటి కేబిన్ ను స్టోర్ / పారామెడిక్స్ ప్రాంతంగా వినియోగిస్తారు.  వైద్య శాఖ అందజేసిన రెండు ఆక్సిజన్ సీలిండర్లను అందుబాటులో ఉంచుతారు. కేబిన్ లో సైడ్ బెర్త్ ఉండే ప్రదేశంలో వీటిని తగిన విధంగా బిగిస్తారు.  

 

 

ప్రతి క్యాబిన్ లో మధ్య బెర్తులను తీసివేస్తారు.   వైద్య పరికరాలు ఉంచడానికి వీలుగా ప్రతి కేబిన్ లోనూ అదనంగా ఒక్కో బెర్త్ కు రెండు చొప్పున సీసాలు పెట్టుకునే హోల్డర్లను అమరుస్తారు.  ఒక్కో కేబిన్ లో రెండు చొప్పున అదనంగా 3 పెగ్ కోర్ట్ హుక్కులను అమరుస్తారు.  లోపలికి దోమలు రాకుండా అరికట్టడానికీతగినంత వెలుగు వచ్చేందుకు వీలుగా కిటికీలకు దోమ తెరలను అమరుస్తారు.  కాలితోనొక్కితే మూత తెరుచుకునే విధంగా ఉండే చెత్త బుట్టల చొప్పున ఒక్కో కేబిన్ కు మూడు చొప్పున ఉంచుతారు. ఎరుపు, నీలం పసుపు రంగులలో ఉండే ఈ చెత్త బుట్టల్లో చెత్త వేయడానికి, తీయడానికి వీలుగా బ్యాగ్లు అమరుస్తారు. 

 

 

బోగీ లోపల వేడి ప్రభావం నుండి రక్షణ కల్పించే విధంగా బోగీ రెండు వైపులా, పై భాగంలోనూ వెదురు / వట్టి వేరు చాపలు అమరుస్తారు.  లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోడానికి వీలుగా కరెంటు పాయింట్లు అందుబాటులో ఉంచుతారు.  బోగీల అవసరం ఎప్పుడు వస్తే అప్పుడు అన్ని సౌకర్యాలు పని చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

 

ప్రారంభంలో మార్పు చేసే మొత్తం 5,000 బోగీలలో జోనల్ వారీగా కేటాయింపు ఈ విధంగా ఉంది: 

 

 

క్రమ సంఖ్య 

 

 జోన్ 

మార్పు చేయవలసిన బోగీల సంఖ్య  

  క్రమ సంఖ్య  

 

  జోన్  

మార్పు చేయవలసిన బోగీల సంఖ్య  

1.

సి.ఆర్.  

482

9.

ఎన్.డబ్ల్యూ.ఆర్.  

266

2.

ఈ.ఆర్.  

338

10.

ఎస్.ఆర్. 

473

3.

ఈ.సీ.ఆర్  

208

11.

ఎస్.సి.ఆర్. 

486

4.

ఈ.సీ.ఓ.ఆర్  

261

12.

ఎస్.ఈ.ఆర్. 

329

5.

ఎన్.ఆర్. 

370

13.

ఎస్.ఈ.సి.ఆర్. 

111

6.

ఎన్.సీ.ఆర్. 

290

14.

ఎస్.డబ్ల్యూ.ఆర్. 

312

7.

ఎన్.ఈ.ఆర్.  

216

15.

డబ్ల్యూ.ఆర్. 

410

8.

ఎన్.ఎఫ్.ఆర్.  

315

16.

డబ్ల్యూ.సి.ఆర్. 

133

 

 

 

ఈ క్వారంటైన్ / ఐసోలేషన్ బోగీలు / రైళ్ల నిర్వహణ, వినియోగం కోసం సవివరమైన ఎస్.ఓ.పి. ని రైల్వే ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్  జారీ చేస్తారు. బోగీలను మార్పు చేసే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలనీ, బోగీలు వినియోగానికి సిద్దమయ్యే తేదీని రైల్వే బోర్డుకు తెలియజేయాలనీ, రైల్వ జోనల్ కార్యాలయాలకు సూచించారు. 

 

 

 

****


(Release ID: 1609760) Visitor Counter : 222