ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై తాజా సమాచారం

Posted On: 31 MAR 2020 6:29PM by PIB Hyderabad

దేశంలో ప్రబలుతున్న విశ్వమహమ్మారి కొవిడ్-19 నివారణ, నిరోధం మరియు యాజమాన్యాలను అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ఏర్పరచుకొని వివిధ రకాల చర్యలను చేపడుతున్నది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్రపాలిత  ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో గౌ. శ్రీ ప్రధానమంత్రి నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారు.

సామాజిక దూరం పాటించడంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పేదలకు అవసరాలను తీరుస్తూ తమదైన శైలిలో కొవిడ్-19పై చేస్తున్న పోరాటానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న సామాజిక సంస్థల ప్రతినిధుల కృషిని గౌరవ శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు మరియు హైకమిషన్ల అధిపతులతో వీడియో సమావేశంలో మాట్లాడి ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19పై ప్రతిస్పందలను చర్చించారు.

ఈ రోజు నిర్వహించిన మంత్రుల 10వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. హర్షవర్థన్ అధ్యక్షత వహించగా, కేంద్ర  పౌర విమానయాన మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి, విదేశీ వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ డా. ఎస్. జైశంకర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, షిప్పింగ్, రసాయనిక మరియు ఎరువుల మంత్రి, కేంద్ర  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చుబే, ఇతర మంత్రి వర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. లాక్డౌన్ అమలు, వలస కార్మికుల సమస్యలు, వైరస్ క్రొత్తగా ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరోధం, పిపిఇలు, మాస్కులు, వెంటీలేటర్లు వంటి అత్యవసర వస్తువులను సరిపోయే విధంగా చూడటం వంటివి  ఈ సమావేశంలో చర్చించారు.

కొవిడ్-19పై శాస్త్రీయ పోరాటానికి విజ్ఞానశాస్త్ర సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు మరియు నియంత్రణా విభాగాలను సమన్వయపరచడానికి నీతి ఆయోగ్ సభ్యులు ప్రొ.వినోద్ పాల్ మరియు కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారు ప్రొ.కె. విజయ రాఘవన్ల అధ్యక్షతన ఒక శాస్త్ర సాంకేతిక అధికారిక కమీటిని ఏర్పాటు చేయబడింది. శ్రాస్త్ర మరియు సాంకేతిక విభాగం(డిఎస్టి),  జీవసాంకేతిక విజ్ఞాన విభాగం(డిబిటి), శాస్త్ర మరియు పరిశ్రమల పరిశోధన మండలి(సిఎస్ఐఆర్), దేశ రక్షణ మరియు పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్డివో) మరియు భారతీయ శాస్త్ర విజ్ఞాన సంస్థ(ఐఐఎస్సి)లో కలిసి కొవిడ్-19 వ్యాధి పరీక్ష విధానాన్ని అత్యవసర రీతిలో మెరుగుపరచి త్వరిత గతిన తగు నిర్ణయాలు తీసుకునేందుకు కృషిచేస్తుంది ఈ కమిటీ.

కేంద్ర ఆరోగ్య మరియు కుంటుబ సంక్షేమ శాఖ జౌళి మంత్రిత్వ శాఖ, ఔషధ తయారీ సంస్థలు మరియు రాష్ట్రాల భాగస్వామ్యంతో పిపిఇలు, మాస్కులు మరియు వెంటీలేటర్లను మరియు ఇతర అత్యవర వస్తువులను తయారు చేయు పరిశ్రమలను సమన్వయ పరచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ విశ్వమహమ్మారి నిరోధ ప్రక్రియలో వ్యాధి బారిన పడిన ఏ కేసునూ వదల కుండా ఉండేందుకు అవసరమైన పర్యవేక్షణ జరుపుతున్నది.

కొవిడ్-19ను నివారించడం మరియు నిరోధించడంలో అవసరమైన క్షేత్రస్థాయి నిఘా, పర్యవేక్షణ, ప్రయోగశాల పరీక్షలు, వైద్యపరీక్షల యాజమాన్యం, ఏకాంతంగా ఉంచేందుకు తగిన సౌకర్యాల పర్యవేక్షణ, ఇంటెన్సివ్ కేర్, అంటువ్యాధి నియంత్రణా యాజమాన్యం మరియు క్వారంటైన్ యాజమాన్యం కోసం అవసరమైన ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయుష్ ప్రాక్టీషనర్లు, డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఆర్యోగ్య నిపుణుల శిక్షణా వవనరులను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసారు. 30 మార్చిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15,000 మంది నర్సులకు ఆన్లైన్లో రెండు వెబినార్ సమావేశాలను నిర్వహించింది.

ఇప్పటి వరకు 1251 కొవిడ్-19 కేసులు నిర్ధారణ అయ్యాయి మరియు 32 మరణాలు సంభవించినట్లు నివేదిక. గత 24 గంటల్లో 227 క్రొత్త కేసులు నమోదవ్వగా 3 మరణాలు సంభవించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.


(Release ID: 1609729) Visitor Counter : 231