ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ రాయబార, దౌత్య కార్యాలయ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి
Posted On:
30 MAR 2020 7:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ ఎంబసీలు, హైకమిషన్ల అధిపతులతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ మిషన్లతో తొలిసారి ప్రధానమంత్రి అంతర్జాతీయంగా కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి స్పందనలు ఈ సమావేశంలో తెలుసుకున్నారు.
అసాధారణ సమయాలలో అసాధారణ పరిష్కారాలు అంసరమౌతాయని ప్రధానమంత్రి చెప్పారు. ఎందుకంటే ప్రస్తుత ప్రంపంచీకరణ సమయంలో కూడా, ప్రపంచంలో చాలా భాగం తనకు తాను క్వారంటైన్ అమలు చేసుకుంటున్నదని అన్నారు.ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇది తప్పని చర్య అని ఆయన చెప్పారు. అయితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అంతర్జాతీయ వ్యవస్థలు మూతపడడంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థపైన , ఆర్థిక మార్కెట్లపైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైన ఇది తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు.
కోవిడ్ మహమ్మారి విదేశాలనుంచి రాకుండా చూడడానికి , ఆతర్వాత ఇది పెద్ద ఎత్తున విస్తరించకుండా చూడడానికి ఈ ఏడాది జనవరి మధ్య నుంచే మున్నెన్నడూ లేనంత స్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలను భారతదేశం తీసుకున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రపంచంలోనే అతి పెద్ద క్వారంటైన్‌ను లాక్‌డౌన్ ను ఇండియా అమలు చేసిందని ఆయన చెప్పారు.
కరోనా మహమ్మారి సంక్షోభానికి కేంద్రంగా ఉన్న దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా ఇండియా తీసుకువచ్చేందుకు వివిధ దేశాలలోని భారతీయ మిషన్ల అధిపతులు చేసిన కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ఐదు అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవలసిందిగా కూడా ప్రధానమంత్రి వారికి సూచించారు.
1.వారి స్వీయ ఆరోగ్యం, భద్రత, వారి సిబ్బంది, కుటుంబాల ఆరోగ్యం , భద్రత కాపాడుకోవాలన్నారు.
2. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు కొనసాగడంపై గల అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ విదేశాలలో ఉండిపోయిన వారి గురించి పట్టించుకోవాలని సూచించారు. ఇలాంటి వారి ఆత్మ స్థయిర్యాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. అలాగే విదేశాలలో అనుకోకుండా ఉండిపోవలసి వచ్చిన పరిస్థితుల వల్ల వారు ఉండిపోయిన దేశంనుంచి, తలెత్తే సమస్యల విషయంలో వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. అలాగే భారతీయులు ఎదుర్కొనే అవకాశం ఉన్నఇతర సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే అవసరమైన సందర్భంలో , సాధ్యమైన చోట వారికి ఉండడానికి షెల్టర్ కల్పించాలని సూచించారు.
3. అప్రమత్తంగా ఉండి, ఆయా దేశాలలో అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతులు, ఆవిష్కరణలు, శాస్త్రవిజ్ఞాన పరిశోధన ఫలితాలను గమనించుకుంటూ కోవిడ్ -19 పై భారత దేశ పోరాటానికి అనుగుణంగా వైద్య పరికరాలు ఎక్కడెక్కడినుంచి సమకూర్చుకోవచ్చో గమనించాలని అన్నారు.
విదేశాలనుంచి విరాళాలు సేకరించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన PM-CARES (పిఎం- కేర్స్) నిధి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని హెడ్స్ ఆఫ్ మిషన్ కు ప్రధానమంత్రి సూచించారు.
4. ప్రస్తుత సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనున్నందున, విదేశీ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసర సరఫరాలు,లాజిస్టిక్ చెయిన్‌లు, చెల్లింపులు వంటి వాటిపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూడాల్సిందిగా ప్రధాని హెడ్స్ ఆఫ్ ఆఫ్ మిషన్‌లకు సూచించారు.
5. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలపై సునిశిత దృష్టి పెట్టాల్సింది గా ప్రధానమంత్రి సూచించారు.
ఇందుకు ప్రతిగా బీజింగ్, వాషింగ్టన్ డిసి, టెహరాన్, రోమ్, బెర్లిన్, ఖట్మండూ, అబుదాబి, కాబూల్, మాలే, సియోల్ ల లోని భారతీయ మిషన్ల అధిపతులు తమ అభిప్రాయాలను ప్రధానమంత్రికి, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఇతరులకు తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో భారతదేశం తీసుకున్నతిరుగులేని చర్యలను తమ తమ దేశాలలో అభినందిస్తున్న విషయాన్ని వారు ప్రదానమంత్రి దృష్టికి తెచ్చారు.
విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయలకు సహాయం అందించేందుకు ,ప్రత్యేకించి విద్యార్థులు, కార్మికులకు సహాయం అందించేందుకు చేపట్టిన చర్యలను ఆయా మిషన్ల అధిపతులు వివరించారు. కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం స్వయంగా సాగిస్తున్న కృషికి ఉపయోగపడే రీతిలో మందులు, వైద్య పరికరాలు, సాంకేతికత, పరిశోధన తదితర చర్యలను గుర్తించడానికి సంబంధించి తాము చేస్తున్న కృషిని వారు తెలిపారు .కోవిడ్ -19 ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర దేశాలలో నేర్చుకున్న పాఠాలు, వారు అనుసరించిన అత్యుత్తమ పద్ధతులను ఆయా మిషన్ల అధిపతులు వివరించారు. మన పొరుగున, కోవిడ్ -19ని ఎదుర్కొనేందుకు సార్క్ దేశాల కోసం ఇండియా చొరవతో ఏర్పాటైన ప్రత్యేక నిధిని ఉపయోగించి, ఆయా దేశాలకు సహాయం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నుంచి అందుతున్నప్రోత్సాహం, మార్గదర్శనం పట్ల హెడ్స్ ఆఫ్ మిషన్ లు కృతజ్థతలు తెలిపాయి.
ఈ సమావేశం ముగింపు సందర్భగా ప్రధాని, విదేశాలలోని భారతీయ మిషన్లు దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, కోవిడ్ -19 పై భారత్ సాగిస్తున్న పోరాటంలో వారు పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారని అన్నారు.
భారతీయులందరి ఐక్యత, అప్రమత్తత దేశ భవిష్యత్తును రక్షించడానికి ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
****
(Release ID: 1609434)
Visitor Counter : 226
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam