వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో పంట రుణాల చెల్లింపులపై రైతులకు సర్కారు ప్రయోజనాలు
- పంట రుణాలకు సంబంధించి బ్యాంకులకు 2 శాతం మేర వడ్డీ సబ్‌వెన్షన్ సౌలభ్యం
- 31 మే వరకు అన్నదాతలకు 3 శాతం మేర సకాలంలో పంట రుణాల చెల్లింపు ప్రోత్సహకం
Posted On:
30 MAR 2020 4:51PM by PIB Hyderabad
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని కట్టడి చేసే ప్ర్రక్రియలో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్ కాలంలో దేశంలోని అన్నదాతకు ఆసరగా నిలిచేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా పంట రుణాలకు సంబంధించి బ్యాంకులకు 2 శాతం మేర వడ్డీ సబ్‌వెన్షన్‌ను (ఐఎస్) వర్తింపచేస్తున్నట్టు సర్కారు తెలిపింది. దీనికి తోడు మార్చి 1వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య కాలంలో చెల్లించాల్సి ఉన్న రూ.3 లక్షల లోపు పంట రుణాలకు సంబంధించి 3 శాతం మేర సకాలంలో పంట రుణాల చెల్లింపు ప్రోత్సహకంను (పీఆర్ఐ) ఇవ్వనున్నట్టు సర్కారు వెల్లడించింది. దేశంలో లాక్డౌన్ కారణంగా అమలవుతున్న నిబంధనల కారణంగా రైతులు తమ స్వల్ప కాలిక పంట రుణాలను చెల్లించేందుకు గాను తమ తమ ప్రాంతాల నుంచి బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ప్రజలు తమ ఇండ్లు వదిలి బయటకు రాలేకపోతున్న కారణంగా వారు తమ పంటలను సకాలంలో విక్రయించుకోలేక పోతున్నారు. దీంతో వారికి సమయానికి పంట సొమ్ము చేతికి అందడం లేదు. దీంతో సకాలంలో వారు పంట రుణాల చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి అన్నదాతలకు అసరాగా నిలిచేందుకు గాను సర్కారు రైతుల స్వల్ప కాలిక పంట రుణాలపై ఐఎస్, పీఆర్ఐ లబ్ధిని మే 31వ తేదీ వరకు పొడిగించింది. సర్కారు చర్యలతో రైతులు సవరించిన కాలంలో 4 శాతం వడ్డీతో ఏలాంటి అపరాధ రుసుము లేకుండా తమ పంట రుణాలను చెల్లించేందుకు వెసులుబాటు కలుగనుంది.
(Release ID: 1609337)
Visitor Counter : 300
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam