ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పిపిఈ కిట్లు, ఎన్95 మాస్కుల సమీకరణకు విస్తృత చర్యలు.. పూర్తి లభ్యతకు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్న కేంద్రం

Posted On: 30 MAR 2020 3:45PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 నివారణనియంత్రణనిర్వహణను అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తురాష్ట్రాల సహకారంతో వివిధ చర్యలు చేపట్టారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు ( పిపిఇ)మాస్కులువెంటిలేటర్లు అవసరం మేరకు అందుబాటులో తేవడానికి అటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు 24 గంటలూ అదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. వైద్య సిబ్బందికి  పిపిఇలు అందుబాటులో ఉంచడానికి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పని చేస్తోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వెంటిలేటర్ల తయారీ చేసి ఇవ్వబోతుంది. ఔషధాల తయారీ కంపెనీలు ఈ సంక్షోభ సమయంలో ఔషధాల కొరత ఏ మాత్రం లేకుండా చూస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. ఆటో రంగం వెంటికోవిడ్ -19 రోగులకు అవసరంఎందుకంటే వారు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి సిండ్రోమ్ (ARDS) ను అభివృద్ధి చేస్తారు.లేటర్లను తయారు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆపత్కాల పరిస్థితులను ఎదుర్కోడానికి వైద్య సిబ్బందిని కూడా సుశిక్షితులను చేశారు.

వ్యక్తిగత రక్షణ పరికరాలు(పిపిఇ):  ఐసొలేషన్ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో విధులు నిర్వహించే బృందం అంటువ్యాధుల నుండి సురక్షితంగా ఉండడానికి పిపిఇ  కిట్లు వినియోగిస్తారు. వాటిని దేశంలో తయారు చేయలేదు. ఇక పిపిఇల అవసరం పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం రావడంతోకేంద్ర ప్రభుత్వం దేశంలో వాటి తయారీని ప్రోత్సహించడానికి క్రియాశీలకంగా  ప్రయత్నాలు చేసింది. ఈ దిశగా కేంద్ర జౌళీఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలు కలిసి పని చేశాయి. దేశీయ ఉత్పత్తిదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పటి వరకు 11 మంది ఉత్పత్తిదారులు నాణ్యత పరీక్షను పూర్తి చేశారు. 21 లక్షల  పిపిఈ తొడుగులను తయారుచేయడానికి ఆ ఉత్పత్తిదారులు ఆర్డర్ పొందారు. ప్రస్తుతం రోజుకు వారు నుండి వేల తొడుగులు సరఫరా చేస్తున్నారు. వచ్చే వారంలో రోజుకు 15,000 తొడుగులు తయారీ చేసే ప్రయత్నం జరుగుతోంది. మరో తయారీదారుడు తాజాగా అర్హత పొందడంతో  వారి నుండి లక్షల తొడుగులు సమీకరించడానికి  ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3.34 లక్షల పిపిఈ లు వివిధ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 60,000 పిపిఈ లను సేకరించి పంపిణీ చేసింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైనా నుండి మరో 10,000 సేకరించి పంపిణీ చేస్తోంది. విరాళంగా  3 లక్షల పిపిఈ తొడుగులు 4వ తేదీకి చేరుతాయి. లక్షల పిపిఈ లు తయారీకి ఆర్డినెన్సు ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చారు. విదేశాలలో పిపిఈ కిట్లకు అత్యధిక డిమాండ్ ఉండడంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖా ఆ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. సింగపూర్ లో ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేసే వేదికను గుర్తించిన విదేశీ వ్యవహారాల శాఖ 10 లక్షల కిట్ల ఆర్డర్ పెట్టింది. కొరియాకు చెందిన మరో సంస్థను కూడా గుర్తించడం జరిగింది. ఆ సంస్థకు వియత్నాంటర్కీ తయారీదారులతో వ్యాపార ఒప్పందం ఉంది. వారికి రోజుకు ఒక లక్ష పిపిఈ కిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఆ సంస్థ నుండి 20 లక్షల కిట్లను సమీకరించడానికి కేంద్రం నిర్ణయించింది. ఇలా వివిధ విదేశీ ఏజెన్సీల నుండి కిట్ల సేకరణకు ఏ అవకాశం వదలకుండా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎన్95 మాస్కులు:  రెండు దేశీయ సంస్థలు ఈ రకం మాస్కులు తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు చేస్తున్న 50,000 మాస్కులను ఉత్పత్తిని వచ్చే వారానికి ఒక లక్ష వరకు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అక్కడి నుండి కేంద్రంమాస్కులు సేకరిస్తోంది. డిఆర్డిఓ కూడా స్థానిక ఉత్పత్తిదారుల నుండి రోజుకు 20,000 ఎన్95 మాస్కులను సేకరిస్తోంది. వచ్చే వారానికి ఇవి అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 11.95 లక్షల మాస్కుల నిల్వలు ఉన్నాయి. వీటికి అదనంగా లక్షల మాస్కులను గత రెండు రోజుల్లో పంపిణీ చేశారు. నేడు మరో 1.40 లక్షల మాస్కులను పంపిణీ చేస్తున్నారు. పీపీఈ కిట్లలో భాగంగా సింగపూర్ నుండి 10 లక్షల మాస్కులు వస్తున్నాయి. 

వెంటిలేటర్లు: కోవిడ్ -19 రోగులకు వెంటిలేటర్లు  అవసరంఎందుకంటే వారు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)కు గురవుతారు. ప్రస్తుతం కొవిడ్-19 రోగుల్లో 20 మంది కన్నా తక్కువే వెంటిలేటర్లపై ఉన్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 14,000 వెంటిలేటర్లను గుర్తించి సిద్ధం చేయడం జరిగింది. 

నోయిడా కి చెందిన ఆగ్వా హెల్త్ కేర్ అనే ఉత్పత్తిదారుని గుర్తించి 10,000 వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి ఏప్రిల్ రెండో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి కూడా 30,000 వెంటిలేటర్లను సరఫరా చేయమని కోరడం జరిగింది. స్థానిక తయారీదార్లతో ఆ కంపెనీ ఒప్పందం చేసుకుని సరఫరాకు సిద్ధం అవుతుంది. ఆటో రంగానికి చెందిన తయారీ దారులు కూడా వెంటిలేటర్లను తయారు చేసి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసారు.

ఈ లోగా, కొన్ని అంతర్జాతీయ కంపెనీల నుండి కూడా వెంటిలేటర్లను సేకరించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. హామిల్టన్మిన్ద్రేడ్రెగర్ వంటి కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. చైనా పంపిణీ దారుల నుండి కూడా 10,000 వెంటిలేటర్లను తెప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. 

                                                ****


(Release ID: 1609333) Visitor Counter : 226