రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై సాగిస్తున్న పోరాటానికి సహాయంగా ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీ సదానంద గౌడ

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2020 2:56PM by PIB Hyderabad

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తూ పొట్టన పెట్టుకుంటున్న కొవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి తన వంతు సహకారంగా ఒక నెల జీతాన్ని మరియు ఎంపిలాడ్స్ నుండి రు.1 కోటిని ప్రధాన మంత్రి సహాయ నిధికి  విరాళంగా ప్రకటించారు కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మాత్యులు శ్రీ సదానంద గౌడ.  ఈ సందర్భంగా శ్రీ గౌడ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న కొవిడ్-19ను అరికట్టడం కోసం మరియు అందుకు తగిన చికిత్సకోసం తన వంతు సహాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి ఒక నెల జీతాన్ని మరియు ఎంపిలాడ్స్ నుండి రు కోటిని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ మహమ్మారిని అరికట్టడానికి తగిన అన్ని చర్యలను సమయానికి తగినట్లుగా తీసుకుంటున్నదని శ్రీ గౌడ అన్నారు. ప్రత్యేకించి పేద మరియు కార్మికుల కోసం మరియు సామన్య ప్రజల కోసం అవసరమైన అన్ని ఉత్తమ మర్గాల ద్వారా ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలను  ప్రభుత్వం తీసుకుంటున్నట్లు  ఆయన తెలిపారు.


(రిలీజ్ ఐడి: 1609265) సందర్శకుల సూచీ సంఖ్య : : 94
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada