కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల భవిష్యనిధి నుండి తిరిగి చెల్లింపులు లేని మొత్తాన్ని ముందస్తుగా తమ ఖాతా నుండి ఉపసంహరించుకొనుటకు ఉద్యోగులను అనుమతించడానికి భవిష్యనిధి పథకంలో సరవణను ప్రకటించిన కేంద్ర కార్మిక శాఖ
ఈ సవరణను అమలుపరచవలసిందిగా తమ క్షేత్రస్థాయి కార్యాలయాలకు ఆదేశాలిచ్చిన ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయం
Posted On:
29 MAR 2020 12:14PM by PIB Hyderabad
దేశంలో కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ విపత్కర తరుణంలో ఉద్యోగుల భవిష్యనిధిలోని తమ ఖాతాల నుండి ముందస్తుగా తిరిగి చెల్లింపులు లేని మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సభ్యులకు అనుమతిని ఇచ్చేందు కొరకు అవసరమైన సమరణను జిఎస్ఆర్ 225(ఇ) ప్రకటన ద్వారా 1952 ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సరవణను చేపట్టింది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగి యొక్క 3 నెలల మౌళిక జీతం మరియు కరువు భత్యానికి లేదా సభ్యుని ఖాతాలోని ఉన్న మొత్తం నగదులో 75%నికి మించకుండా నగదు మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతినిస్తుంది ఈ ప్రకటన.
కొవిడ్-19 ప్రపంచవ్యాప్త వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యనిధి పథకం 1952 ప్రకారం అర్హులైన దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో మరియు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యనిధిలో సభ్యత్వం ఉన్న ఉద్యోగులు వారి భవిష్యనిధి ఖాతా నుండి ఈ ముందస్తు తిరిగి చెల్లింపులు లేని నగదు ఉపసంహరణ లబ్దిని పొందడానికి అర్హులు. ఉద్యోగుల భవిష్యనిధి పథకం, 1952లో పేరా 68ఎల్ క్రింద ఒక ఉప-పేరా(3)ని చేర్చారు. ఈ పథకంలో సవరించిన ఉద్యోగుల భవిష్యనిధి(సవరణ) పథకం,2020 28 మార్చి 2020 నుండి అమలులోనికి వస్తుంది.
ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సభ్యులు ఎవరైనా నగదు కొరకు దరఖాస్తు చేసుకున్నట్లైతే వారి దరఖాస్తులు త్వరితంగా పరిశీలించి ప్రక్రియను చేపట్టవలసిందిగా మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయాలకు తగిన ఆదేశాలను ఇచ్చింది. ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయం తమ కార్యాలయాలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఉద్యోగుల భవిష్యనిధి సభ్యులు ఎవరైనా అనుమతించిన మేరకు నగదు ఉపసంరణ కొరకు దరఖాస్తు చేసుకున్నట్లైతే ఆయా కార్యాలయాల అధికారుల మరియు సిబ్బంది వారి దరఖాస్తులను తగిన విధంగా వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేసి ఈ కొవిడ్-19 ఎదుర్కొనే విషయంలో వారికి మరియు వారి కుటుంబానికి సహకరించవలసిందిగా పేర్కొంది.
(Release ID: 1609013)
Visitor Counter : 208