ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్-19 పై పోరుకు రాజ్యసభ సభ్యులు ఎంపీలాడ్స్ నిధులు ఇవ్వండి

చిక్కుకున్న వలస కార్మికులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించండి:

స్వచ్ఛంద మరియు ధాతృత్వ సంస్థలకు ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి


పీఎం-కేర్స్ నిధికి పౌరులు విరాళాలివ్వండి

Posted On: 29 MAR 2020 12:02PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి భూరిగా విరాళాలు ఇచ్చి ధాతృత్వాన్ని చాటాలని పార్లమెంట్ సభ్యులను ఉపరాష్ట్రపతిరాజ్యసభ ఛైర్మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు కోరారు. తమ ఎంపీలాడ్స్ నుండి మొదట కనీసం కోటి రూపాయలు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంపీలకు ఆయన ఒక లేఖ రాస్తూకోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని అత్యవసర అదనపు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంతో పాటు అనేక మంది ఈ వ్యవస్థలో ఉన్న భాగస్వాములు ప్రజల కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో ఆదుకోడానికి ముందుకు వస్తున్నారని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. 

కోవిడ్-19ని విజయవంతంగా ఎదుర్కోవటానికి అపారమైన ఆర్థిక వనరులు-వాస్తు సామాగ్రిమానవ అవసరాన్ని ప్రస్తావించిన శ్రీ వెంకయ్య నాయుడుజాతీయరాష్ట్ర మరియు జిల్లా స్థాయిల్లో నిధుల లభ్యతను పెంచడానికి భారత ప్రభుత్వం వివిధ మార్గాల నుండి ఆర్థిక వనరులను సమీకరిస్తోందని అన్నారు. సకాలంలో ఈ సహాయం అందుబాటులో ఉంటేనే కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదురుకోవచ్చని ఆయన అన్నారు. అందుకుపార్లమెంట్ సభ్యలు కూడా తమకు అకాధికారికంగా లభించే ఎంపీ నియోజక వర్గ అభివృద్ధి నిధుల పథకంలో ఈ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన నిధుల్లో రూ.కోటి ని ఇవ్వడానికి తగు అనుమతులుఆదేశాలు ఆ నిధులు నిర్వహించే అధికారులకు ఇవ్వాలని శ్రీ వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రాం ఇంప్లీమెంటేషన్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సడలించిఒకే సారి ఎంపీలాడ్స్ నిధులను కోవిడ్-19 అవసరాలకు వినియోగించేలా ఆదేశాలు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. 

విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు ఏర్పాటైన పీఎం-కేర్స్ నిధికి ఎవరైనా వ్యక్తిగతంగా నిధులు ఇవ్వవచ్చనిఅందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి పిలుపు ఇచ్చారు. ఈ సంకట పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేక పౌర సంఘాలుసామాజిక సంస్థలు పేదలనుసాయం అవసరమైన వారిని ఆడుకోడానికి ముందుకు రావడాన్ని ఆయన ప్రశంసించారు. అయితే ఇదే సందర్భంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు పూర్తిగా సురక్షితగా ఉండేలా ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవడం మరువరాదని ఉపరాష్ట్రపతి అప్రమత్తం చేశారు. 

అంతకముందు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గౌరవనీయ లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లారెండు సభల సెక్రటరీ జనరల్స్ తో సమావేశమయ్యారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్రాజ్యసభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీలాడ్స్ విషయంలో మాట్లాడారు.

పీఎం-కెర్స్ నిధికి విరాళాలిస్తూ వివిధ వర్గాల ప్రజలు చూపిన ధాతృత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఇంకా ప్రజలు, ముందుకు వచ్చి ఈ గొప్ప ప్రయత్నం కోసం విరాళం ఇవ్వమని విజ్ఞప్తి చేశారుఉన్నదాంట్లో నలుగురికీ పంచివ్వడం,   అదే సమయంలో తోటి వారి క్షేమాన్ని కాంక్షించడమే భారతీయ పురాతన సంప్రదాయమనిఇదే భారతీయ తత్వమని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. 

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. వారికి  ఆహరంఆశ్రయం కల్పించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలుధాతృత్వ సంస్థలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అటువంటి కార్మికులను పనుల్లో పెట్టుకున్న ఏజెన్సీలు వారిని ఆదుకోవాలని సూచించారు. 

వలస కార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర కార్మిక శాఖ (ఇంఛార్జి) సహాయ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్కాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా ను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. 

                                        ****


(Release ID: 1608990) Visitor Counter : 179