హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి సమాయత్తతను సమీక్షించేందుకు మార్చి 25 నుంచి మూడో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ అమిత్ షా

Posted On: 28 MAR 2020 10:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సగటు జీవికి రోజువారీ నిత్యాసరాలు అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై హోం మంత్రి సమీక్ష
ప్రతీ ఒక్క పౌరుని భద్రత, రక్షణకు శ్రీ మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది : అమిత్ షా
28, మార్చి 2020
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో భాగంగా హోంమంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఇది మూడో సమీక్షా సమావేశం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా సగటు జీవికి రోజువారీ నిత్యావసరాలు తగినంతగా సరఫరా కావడానికి చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం వహించడంలేదని, ప్రయత్న లోపం ఏ మాత్రం లేకుండా చూసుకుంటున్నదని ఆ సమావేశంలో శ్రీ షా తెలిపారు. దేశంలో ప్రతీ ఒక్క పౌరుని భద్రత, రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని ఆయన హామీ ఇచ్చారు.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రులు శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ జి.కిషన్ రెడ్డి, మంత్రిత్వ శాఖకు చెందిన కంట్రోల్ రూమ్ లోని సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కూడా సామాజిక దూరం నిబంధన కట్టుదిట్టంగా అమలుపరిచారు.
కోవిడ్-19పై ఇప్పటివరకు హోంమంత్రిత్వ శాఖ నిర్ణయాలను ఈ దిగువ వెబ్ సైట్ లో చూడవచ్చు. 

***
 



(Release ID: 1608956) Visitor Counter : 186