రైల్వే మంత్రిత్వ శాఖ
21 మార్చి-14 ఏప్రిల్ 2020 తేదీల్లో ప్రయాణ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి సొమ్మును తిరిగి చెల్లించనున్న భారతీయ రైల్వే
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా రైళ్ళ రద్దు మరియు 14 ఏప్రిల్ 2020 వరకు టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్న కారణంగా ఈ నిర్ణయం
Posted On:
28 MAR 2020 2:42PM by PIB Hyderabad
21 మార్చి 2020 నుండి 14 మార్చి 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ళ రద్దు మరియు 14 ఏప్రిల్ 2020 వరకు అన్ని ప్రయాణ టికెట్లను రద్దు చేసిన కారణంగా ఆయా రైళ్ళలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు టికెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును తిరిగి చెల్లించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ నిర్ణయం 21-03-2020 తేదీ నాటికి సంబంధించి సొమ్ము తిరిగి చెల్లింపు నింబంధనల సడలింపునకు కొనసాగింపు మరియు అదనపు ఆదేశాలు. టికెట్ల సొమ్ము పూర్తి చిల్లింపులు పొందుటకు పాటించవలసిన ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంది-
1. టికెట్ కౌంటర్లో బుక్ చేసుకున్న పిఆర్ఎస్ టికెట్లు:
ఎ. 27-03-2020కు ముందు రద్దు చేసుకున్న టికెట్లు: రద్దుచేసుకున్న టికెట్ల సొమ్ము తిరిగి చెల్లింపులు పొందడానికి 21 జూన్ 2020 తేదీలోగా ఏదైనా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంలోని ప్రధాన కమర్షియల్ మేనేజరు(సిసిఎం) లేదా ప్రధాన క్లెయిమ్సు అధికారి(సిసిఓ)కి సంబంధిత దరఖాస్తును తగిన వివరాలతో నింపి, టిడిఆర్(టికెట్ల జమ రశీదు)ను జత చేసి అందజేయవలెను. రద్దుచేసుకున్న టికెట్లకు సంబంధించి తగిన సొమ్ము తగ్గింపు అనంతరం మిగతా సొమ్ము తిరగి చెల్లించడానికి రైల్వే ఏర్పాట్లు చేస్తుంది.
బి. 27-03-2020 అనంతరం రద్దయిన టికెట్లు: అటుంటి టికెట్లకు పూర్తి సొమ్ము తిరిగి చెల్లింపబడుతుంది.
2. ఈ-టికెట్లు:
ఎ. 27-03-2020కు ముందు రద్దయిన టికెట్లు: మిగతా చెల్లింపు మెత్తాన్ని ఏ ఖాతా నుండి టికెట్లను బుక్ చేసుకున్నారో ఆ ప్యాసింజరు యొక్క ఖాతాలోనికి జమ చేయబడతాయి. ఐఆర్సిటిసి ఈ మిగతా మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది.
బి. 27-03-2020 తరువాత రద్దయిన టికెట్లు: ఆయా రద్దయిన టికెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును తిరిగి చెల్లించడానికి తగిన ఏర్పాట్లు ఇదివరకే చేయబడినాయి.
(Release ID: 1608860)
Visitor Counter : 157
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada