బొగ్గు మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 లాక్ డౌన్ కాలంలో కూడా క్లిష్టమైన బొగ్గు సరఫరాల నిర్వహణకు హామీ ఇచ్చే విధంగా బొగ్గు మంత్రిత్వ శాఖ పని చేస్తోంది – శ్రీ ప్రహ్లాద్ జోషి
Posted On:
28 MAR 2020 12:14PM by PIB Hyderabad
బొగ్గు సరఫరాను అత్యవసర సేవగా ప్రకటించామని, కోవిడ్ -19 లాక్ డౌన్ కాలంలో కూడా క్లిష్టమైన బొగ్గు సరఫరా నిర్వహించబడుతుందని కేంద్ర బొగ్గు, గనుల, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు. ఇందు కోసం బొగ్గు మంత్రిత్వ శాఖలోని అధికారులంతా కృషి చేయాలని ఆదేశించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ప్రజాజీవితం స్థంభించినప్పటికీ శక్తి మరియు ఇతర కీలకమైన రంగాల మీద ఆ ప్రభావం ఉండకూడదని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తి, సరఫరా మరియు పంపకాల పర్యవేక్షణ కోసం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులందరితో రోజువారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన తొలి వర్చువల్ సమావేశాన్ని 26 మార్చి 2020న బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అనికుమార్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. దీనికి సంబంధించిన రోజు వారి నివేదికను మంత్రి గారికి అందజేస్తారు. బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తిగా కాగిత రహిత కార్యాలయం కాబట్టి, ఈ మంత్రిత్వ శాఖలోని సిబ్బంది మొత్తం డ్యూటీ రోస్టర్ల ప్రకారం ఇంటి నుంచే ఈ-ఆఫీస్ ప్లాట్ ఫాం మీద పని చేస్తున్నారు.
2020 మార్చి 26 నాటికి విద్యుత్ ప్లాంట్లలో 24 రోజులకు సరిపడా 41.8 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ప్రతి బొగ్గు ఆధారిత పరిశ్రమ మరియు విద్యుత్ రంగానికి బొగ్గు సులువుగా మరియు అవసరాలకు తగ్గట్టుగా లభించే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి గారు తెలియజేశారు.
ఈ సందర్భంలో కోల్ ఇండియా లిమిటెడ్ పని తీరును కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఇక్కడ అధికారులు, కార్మికులందరూ బొగ్గు ఉత్సత్తికి భరోసానిస్తూ క్లిష్టమైన సమయంలో కూడా సరఫరాను ప్రభావితం కానివ్వడం లేదని తెలిపారు. ఈ లాక్ డౌన్ కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సమ్మతి అవసరం లేని ఆమోదాలు జరగవని శ్రీ ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు.
(Release ID: 1608809)
Visitor Counter : 141