రక్షణ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 సవాలును ఎదుర్కోడానికి కంటోన్మెంట్ బోర్డులు సన్నద్ధం
Posted On:
27 MAR 2020 3:20PM by PIB Hyderabad
కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి దేశ వ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులు సన్నద్ధం అయ్యాయి. 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. వాటి పరిధిలో ఉన్న జనాభా 21 లక్షలు (సైన్యం, పౌరులు కలిపి). ఎటువంటి పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా వాటి పరిథిలో ఉన్న ఆస్పత్రులు, పడకలను గుర్తించి సిద్ధంగా ఉంచాల్సిందిగా ఆదేశాలు జరీ అయ్యాయి. స్థానికంగా ఉన్న అధికారులతో కంటోన్మెంట్ బోర్డుల అధ్యక్షులు, సీఈఓ లు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అవసరమైన సహాయాన్ని అందించడానికి చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరీ చేసిన సూచనలు, ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నారు.
కంటోన్మెంట్ బోర్డు పరిథిలో ఉన్న కార్యాలయాలు, భవనాలు, ప్రాంగణాలు, పార్కులు, మార్కెట్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. బహిరంగ ప్రకటనలు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు, సమాచార పత్రికల ప్రచారం అన్ని ప్రాంతాల్లో ప్రముఖంగా నిర్వహిస్తు స్థానికులలో చైతన్యం కలిగిస్తున్నారు. అత్యవసర సర్వీసులు అందించే సిబ్బంది, అధికారులకు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు తగు శిక్షణ చేపట్టి కోవిడ్ విస్తరించకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు వివరిస్తున్నారు. డిఫెన్సె ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్ (డిజిడిఈ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తి సమయం పని చేస్తూ అవసరమైన వైద్య సహాయం అందించడానికి అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది అందరికి ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులను కంటోన్మెంట్ బోర్డులు అందుబాటులో ఉంచాయి. కంటోన్మెంట్ బోర్డుల పరిథిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు గట్టి ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానికులకు అందేలా సిబ్బందితో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుంది. ధరలు అదుపు తప్పకుండా చూస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాల పరిథిలో ఉన్న మున్సిపల్ పరిపాలన కంటోన్మెంట్ బోర్డుల కింద పనిచేస్తాయి. సైన్యానికి సంబంధించిన ప్రాంగణాలు, సైనిక సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా కలిసి నివసించే ప్రాంతాలు ఇవి.
***
(Release ID: 1608658)
Visitor Counter : 149