ప్రధాన మంత్రి కార్యాలయం

బ్రిటన్ ప్రధానమంత్రికి త్వరగా స్వస్థత చేకూరాలని భారత ప్రధానమంత్రి ఆకాంక్షించారు

प्रविष्टि तिथि: 27 MAR 2020 6:48PM by PIB Hyderabad

యు.కే. ప్రధానమంత్రి శ్రీ బోరిస్ జాన్సన్ కు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్ష వ్యక్తం చేశారు.  

" ప్రియమైన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఒక పోరాట యోధునిగా మీరు ఈ సవాలును కూడా అధిగమిస్తారు.   మీ సంపూర్ణ ఆరోగ్యానికి మేము ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యవంతమైన యుకే ని ఆశిస్తున్నాము" అని ప్రధానమంత్రి ఒక సందేశంలో తమ ఆశాభావం వ్యక్తం చేశారు. 

*****


(रिलीज़ आईडी: 1608642) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam