రక్షణ మంత్రిత్వ శాఖ
కొవిడ్ -19 పై సుదీర్ఘ పోరాటానికి దక్షిణ నావికా కమాండ్ సిద్ధం
Posted On:
27 MAR 2020 12:25PM by PIB Hyderabad
కోవిడ్ ని అంతమొందించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో, దక్షిణ నావికా కమాండ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, సమన్వయంతో పలు చర్యలను చేపట్టింది. పౌర సమాజానికి సహాయం అందించడానికి తన వద్ద ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని మహమ్మారిపై పోరాటానికి కమాండ్ సిద్ధం అయింది. తన సిబ్బందిని అవసరం మేరకు ఈ సంక్షోభ సమయంలో అందుబాటులో ఉంచి ఎక్కడ అవసరమైతే అక్కడ మోహరించనున్నది. యుద్ధభూమిలో నర్సింగ్ సహాయం అందించే 10 బిఎఫ్ఎన్ఏ బృందాలను సిద్ధం చేశారు. వైద్యేతర సిబ్బంది ఈ బృందంలో ఉంటారు. కొచ్చి లో వీరు అందుబాటులో ఉండి వైద్య బృందానికి అవసరమైన సమయంలో సహాయకారులుగా నిలుస్తారు. ఇటువంటి బిఎఫ్ఎన్ఏ బృందాలను దక్షిణ నావికా కమాండ్ కి చెందిన అన్ని స్టేషన్లలో అందుబాటులో ఉంచుతారు. ఎక్కడి వారు అక్కడే ఉండండి.. ప్రయాణాలకు అనుమతి లేదు అనే విధానాన్ని తమ సిబ్బందికి అమలు చేసారు.
కొచ్చి లోని ఉన్న తన శిక్షణ కేంద్రంలో కరోనా కేర్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేసి, వివిధ దేశాల్లో చిక్కున్న 200 మంది భారతీయులను విమానాల్లో ఇక్కడకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరలించారు. మరో సీసీసీ ని కూడా ఇంకో 200 మందికి సేవలు అందించేలా సిద్ధం చేసారు. ఈ రెండిటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అవసరమైన ఆహరం, మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చి వైద్య వ్యర్థాల నిర్వహణ కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 14 రోజుల పాటు వినోద ఏర్పాట్లు కూడా చేసారు. ఈ కేంద్రాలను దీనికోసం ప్రత్యేకంగా కేటాయించిన అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రత్యేకంగా భారత నావికా దళానికి చెందిన వైద్యులు, నర్సులు రోగులకు అందుబాటులో ఉంటారు. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలు విధించిన వైద్య నిబంధనలకు అనుగుణంగా ఈ బృందాలు పనిచేస్తాయి. సైనిక కుటుంబాలకు బహిరంగ ప్రదేశాల్లో తీసుకోవలసిన ప్రత్యేక పారిశుధ్య పరిశుభ్రత చర్యలపై అవగాహనను కూడా కల్పిస్తున్నారు.
(Release ID: 1608557)
Visitor Counter : 131