మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్ బి టి) వారిచే #స్టే హోమ్ఇండియావిత్ బుక్స్ కార్యక్రమం ప్రారంభం

ఎన్ బి టి వెబ్సైట్ నుంచి 100కు పైగా పుస్తకాలను పి డి ఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Posted On: 25 MAR 2020 9:14PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాధివిస్తరణను అరికట్టడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిరోధక చర్యలలో భాగంగా ప్రజలు ఇళ్ళలో ఉండటాన్ని #స్టేఇన్ మరియు #స్టే హోమ్, ఇంటిలో ఉండి పుస్తకాలు చదవడాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా  మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ ఎంపిక చేసిన ప్రజాదరణ పొందిన ఉత్తమ గ్రంధాలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని #స్టేహోమ్ఇండియావిత్ బుక్స్ కార్యక్రమం ద్వారా కలుగజేస్తోంది. 

వందకు పైగా పుస్తకాలను పి డి ఎఫ్ రూపంలో ఎన్ బి టి వెబ్సైట్ https://nbtindia.gov.in  నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  పుస్తకాలు హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, మలయాళం, ఒడియా, మరాఠీ, కోక్బోరోక్, మిజో, బోడో, నేపాలీ, తమిళ్, పంజాబీ, తెలుగు, కన్నడ, ఉర్దూ మరియు సంస్కృతం భాషలలో ఉంటాయి. అందుబాటులో ఉంచిన వాటిలో కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన అన్ని సాహితీ ప్రక్రియలు, జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, ఉపాధ్యాయుల కరదీపికలు మరియు అధికసంఖ్యలో  పిల్లలు, యువతకు పనికివచ్చే పుస్తకాలు ఉంటాయి.  అవికాకుండా ఠాగూర్, ప్రేం చంద్ రచనలు, మహాత్ముని గురించిన పుస్తకాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు చదివి సంతోషించే పుస్తకాలివి. మరిన్ని కొత్త పుస్తకాలను ఈ జాబితాలో చేర్చడం జరుగుతుంది.

ఎంపిక చేసిన పుస్తకాలలో .. హాలిడేస్ హావ్ కం, ఎనిమల్స్ యూ కాంట్ ఫర్గెట్,  నైన్ లిటిల్ బర్డ్స్,  ది పజిల్,  గాంధీ తత్వ శతకం, వుమెన్ సైంటిస్ట్స్ ఇన్ ఇండియా,  యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ సైన్స్,  ఏ టచ్ ఆఫ్ క్లాస్,  గాంధీ:  వారియర్ ఆఫ్ నాన్ వాయిలెన్స్ మరియు ఇంకా అనేకం ఉన్నాయి.

పి డి ఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకున్న పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించాలి.  మరియు వాటిని అధికారం లేకుండా లేక వాణిజ్య సరళిలో ఉపయోగించడానికి అనుమతి లేదు.

*****

 


(Release ID: 1608355) Visitor Counter : 201