హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో జనాభా లెక్కల కార్యక్రమం 2021, జాతీయ జనాభా జాబితా నవీకరణ వాయిదా
प्रविष्टि तिथि:
25 MAR 2020 4:18PM by PIB Hyderabad
రాబోయే సంవత్సరంలో ప్రకటించే జనాభా లెక్కలకు సంబంధించిన సేకరణ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం మొదటి దశ పనులు ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్యన జరగాలి. అలాగే రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగాలి. అలాగే ఎన్ పి ఆర్ కార్యక్రమాన్ని ( అస్సాం మినహా) జనాభా లెక్కల మొదటి దశతోపాటు నిర్వహించాల్సి వుంది. అయితే కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా జనాభా లెక్కల మొదటిదశ కార్యక్రమం (ఏప్రిల్ 1, 2020నుంచి మొదలు కావాల్సి వుంది), దాంతోపాటు చేపట్టాల్సిన ఎన్ పిఆర్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది.
*******
(रिलीज़ आईडी: 1608249)
आगंतुक पटल : 332