రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 ఐసోలేషన్ వార్డుల కోసం 285 పడకలు కేటాయించిన యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ బోర్డు

Posted On: 25 MAR 2020 1:53PM by PIB Hyderabad

కరోనా వైరస్ (కోవిడ్ -19) కేసులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల కోసం 285 పడకలు ప్రత్యేకిస్తూ యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ బోర్డు(ఓ ఎఫ్ బి) నిర్ణయం తీసుకుంది.  జబల్పూర్ వాహనాల తయారీ ఫ్యాక్టరీలోని ఆసుపత్రులలో 40 పడకలు,  ఇషాపూర్ లోహాలు, ఉక్కు ఫ్యాక్టరీ ,  కాశీపూర్ తుపాకులు, ఫిరంగి గుండ్ల ఫ్యాక్టరీ,  ఖడ్కీ  మందుగుండు తయారీ ఫ్యాక్టరీ,  కాన్పూర్ యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ,  ఖమారియా యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ,  అమ్బఝారీ యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ ఆసుపత్రులలో ఒక్కొక్కదానిలో 30 పడకల చొప్పున,  అంబర్నాద్ యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ ఆసుపత్రిలో 25 పడకలు,   ఆవడిలోని భారీ వాహనాల ఫ్యాక్టరీ, మెదక్ యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ ఆసుపత్రులలో ఒక్కొక్కదానిలో 20 పడకల చొప్పున కేటాయించాలని బోర్డు నిర్ణయించింది. 

యుద్ధసామగ్రి ఫ్యాక్టరీ బోర్డు ఆసుపత్రులలో నిర్ణయించిన మేరకు పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తారు.  కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రెటరీ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్ర్హిత్వ శాఖ సూచన మేరకు ఓ ఎఫ్ బి చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  అదేవిధంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్ర్హిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి అందిన ప్రయోగాత్మక ఆర్డరు మేరకు వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఇ) మరియు మాస్కుల తయారీకి కూడా ఓ ఎఫ్ బి ప్రయత్నిస్తోంది.

 

 

         

 

 


(Release ID: 1608245) Visitor Counter : 172