ప్రధాన మంత్రి కార్యాలయం

కరోనా వైరస్‌ ఇతివృత్తంతో పాటలపై గాయకులకు ప్రధానమంత్రి అభినందనలు

జనతా కర్ఫ్యూపై తన సందేశానికి ప్రాచుర్యం కల్పించిన ప్రముఖులకు ప్రధాని ప్రశంస

Posted On: 22 MAR 2020 2:33PM by PIB Hyderabad

  కరోనా వైరస్‌ ఇతివృత్తంగా పాటలు పాడిన గాయనీగాయకులు మాలినీ అవస్థి, ప్రీతమ్‌ భరత్వాన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు వారి పాటలను ట్విట్టర్‌ద్వారా ప్రజలతో పంచుకుంటూ “జనతా కర్ఫ్యూపై తమదైన పద్ధతిలో సహకరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. జానపద గాయకురాలు @maliniawasthi ji తన శైలిలో ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు... #JantaCurfew", “అలాగే జానపద గాయకుడు ప్రీతమ్ భరత్వాన్‌ జీ కూడా జనతా కర్ఫ్యూపై తన గీతంద్వారా ఎంతో శ్రావ్యమైన రీతిలో ఓ ప్రత్యేక సందేశాన్నిచ్చారు... #JantaCurfew" అని కొనియాడారు. అలాగే వివిధ మాధ్యమాల సోదరులు కూడా సముచిత సమాచారాన్ని ప్రజలకు అందించడంతోపాటు తగు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని, ఆశావాదాన్ని ప్రోదిచేసే సందేశ వ్యాప్తికి మాధ్యమ మిత్రులు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. తానిచ్చిన జనతా కర్ఫ్యూ సందేశాన్ని ప్రజా సమూహాల వద్దకు చేర్చడంలో ప్రముఖులు చూపిన చొరవను కూడా ఆయన ప్రశంసించారు. “కరోనా వైరస్‌పై పోరాటం కోసం ప్రజలంతా ఆదివారంనాడు ఇళ్లలోనే ఉండేవిధంగా ప్రముఖ వ్యక్తులంతా ప్రజలను ప్రభావితం చేశారు. అందుకు తగినట్లుగా ప్రజలు కూడా అద్భుతరీతిలో మద్దతిచ్చి సహానుభూతిని చాటారు” అని వరుస ట్వీట్లలో కృతజ్ఞతలు తెలిపారు. ‘జనతా కర్ఫ్యూ’లో నేడు భాగస్వాములు కావాల్సిందిగా అంతకుముందు ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో వారి భాగస్వామ్యం తిరుగులేని బలాన్నిస్తుందని పేర్కొన్నారు. ఈ సమయంలో సామాజిక దూరం పాటించడంలోని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- విలువైన సమయాన్ని ఇంటికే కేటాయించాలని, విందు వినోదాలతో కుటుంబసభ్యులందరితో ఆనందం పంచుకోవాలని సూచించారు. కోవిడ్‌-19పై ప్రస్తుత యుద్ధంలో మనలో ప్రతి ఒక్కరం సైనికులమేనంటూ- మన అప్రమత్తత, ముందుజాగ్రత్తలే లక్షలాది ప్రజల ప్రాణాలకు రక్ష కాగలవని స్పష్టం చేశారు. ఆ మేరకు వీధులంతా ఖాళీగా కనిపించినా కోవిడ్‌-19పై పోరాట సంకల్పం మాత్రం మదిలో నిండుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
   భారత దేశం కోవిడ్‌-19ని జయించి తీరగలదన్న విశ్వాసం నింపుతూ ప్రజల్లో ఆశావాదాన్ని, సానుకూల దృక్పథాన్ని ప్రోదిచేసేలా మాధ్యమ శక్తిని అద్భుతంగా ఉపయోగించారు- మీ బృందం పనితీరు భేష్‌...  @CNNnews18! #JantaCurfew https://t.co/HJC7HfmFMt
—నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
వీధులన్నీ ఖాళీగా కనిపించాయి... కానీ, కోవిడ్‌-19పై పోరాట సంకల్పం మాత్రం నిండుగా ఉంది... #JantaCurfew https://t.co/9fTjpbhjal 
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
ముందుండి నడిపించడమంటే ఇదే!
మాధ్యమ సోదరులు సముచిత సమాచారం ఇవ్వడమే కాకుండా తగిన జాగ్రత్తలు వహించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.  #JantaCurfew https://t.co/eOBau0JcP6
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
ఎప్పటిలాగానే భావోద్వేగం కనిపించింది అర్ణబ్‌!
ఆరోగ్యకర భారతం దిశగా మద్దతిచ్చిన @republic బృందానికి అభినందనలు. #JantaCurfew https://t.co/EzBILnwh6p
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
సామాజిక దూరం పాటింపునకు భరోసా కల్పించాల్సిన సమయమిదే. 
ఇందుకోసం డిజిటల్‌ చెల్లింపుల విధానం మీకు తోడ్పడుతుంది. అందుకే ఈ దిగ్గజాలు చెబుతున్నదేమిటో విందాం.. డిజిటల్‌ చెల్లింపుల పద్ధతిని అనుసరిద్దాం. 
 #PaySafeIndia @NPCI_NPCIhttps://t.co/qsNcs0EhKIhttps://t.co/imtK8x98XThttps://t.co/yzKPHiXEvDhttps://t.co/TMuZdPqR2O
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
-విందువినోదాల నడుమ కుటుంబంతో విలువైన సమయం గడిపే తరుణమిది..
కోవిడ్‌-19పై ఈ యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ సాహస సైనికులే.
మీ అప్రమత్తత, ముందుజాగ్రత్తలే లక్షలాది ప్రజల ప్రాణాలకు రక్ష  #JantaCurfew https://t.co/zuoocrP4Th
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
#JantaCurfew కొనసాగుతుంది.

కరోనావైరస్‌ పోరాటం దిశగా దేశంలోని ప్రముఖులంతా ప్రజలను ప్రోత్సహించడం సంతోషం. అలాగే ప్రజల దృఢమైన మద్దతు లభించింది..https://t.co/FpSM7DXxQ1https://t.co/JmmqldtpBBhttps://t.co/iC2PFywebu
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
మీకు ఈ లింకు కనిపిస్తోందా? 
ప్రజలందరూ అన్నీ మరచి కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో చేతులు కలిపారని స్పష్టమవుతోంది.. #JantaCurfew https://t.co/Sk3zpolbdY
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
మేమీ దిశగానే ముందడుగు వేస్తామని భారత ప్రజలంతా నిర్ణయించుకున్నారు. కోవిడ్‌-19 మహమ్మారిపై సమష్ట పోరాటానికి సిద్ధమయ్యారు. #JantaCurfew https://t.co/A1KsBWKTNR
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
జానపద గాయకుడు ప్రీతమ్ భరత్వాన్‌ జీ జనతా కర్ఫ్యూపై తన గీతంద్వారా ఎంతో శ్రావ్యమైన రీతిలో ఓ ప్రత్యేక సందేశాన్నిచ్చారు.. #JantaCurfew https://t.co/OOFuNlnj66
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
జనతా కర్ఫ్యూపై తమదైన పద్ధతిలో సహకరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. జానపద గాయకురాలు @maliniawasthi ji తన శైలిలో ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు... #JantaCurfew https://t.co/APhgwP2UlP
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
ఇక మరికొన్ని నిమిషాల్లో జనతా కర్ఫ్యూ ప్రారంభమవుతుంది. #JantaCurfew  

ఈ కర్ఫ్యూలో మనమంతా భాగస్వాములం అవుదాం.. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటానికి ఇది మరింత బలాన్నిస్తుంది. ఇవాళ మనం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో మనకు తోడ్పడతాయి. అందుకే ఇళ్లలోనే ఉండండి... ఆరోగ్యంగా ఉండండి.  #IndiaFightsCorona pic.twitter.com/11HJsAWzVf
-నరేంద్ర మోదీ (@narendramodi) March 22, 2020
******
 



(Release ID: 1607971) Visitor Counter : 184