ప్రధాన మంత్రి కార్యాలయం

నేపాల్ ప్రధానమంత్రిని ప్రశంసించిన ప్రధాని మోదీ

प्रविष्टि तिथि: 20 MAR 2020 11:30PM by PIB Hyderabad

కోవిడ్ -19 అత్యవసర నిధికి సహాయం అందిస్తానని ప్రకటించిన నేపాల్ ప్రదానమంత్రి శ్రీ కె.పి. శర్మ ఓలిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. “కోవిడ్ -19 అత్యవసర నిధికి నేపాల్ రూ. 10 కోట్లు విరాళం ఇస్తామని నేపాల్ ప్రదానమంత్రి శ్రీ కె.పి. శర్మ ఓలి ప్రకటించడాన్ని నేను ప్రశంసిస్తున్నాను. ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడానికి సార్క్ దేశాలు జరుపుతున్న ఉమ్మడి పోరాటానికి ఓలి గారి కట్టుబాటును, మద్దతును ఇది ప్రతిబింబిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు.


(रिलीज़ आईडी: 1607581) आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil