ప్రధాన మంత్రి కార్యాలయం
ఆదివారం జనతా కర్ఫ్యూకి మద్దతు ఇచ్చిన భిన్న వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2020 8:53PM by PIB Hyderabad
నాడు పోస్టు చేయడమైనది: 20 మార్చి 2020 రాత్రి 8.53కి పిఐబి ఢిల్లీ
కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా మార్చి 22వ తేదీ ఆదివారంనాడు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ తాను ఇచ్చిన పిలుపును విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చేందుకు సంఘటితంగా చర్యలు తీసుకున్నందుకు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ప్రధానమంత్రి ప్రశంసించారు.
జనతా కర్ఫ్యూకి వివిధ రంగాలకు చెందిన, వివిధ సంస్థలకు చెందిన ప్రభావకర్తలు, సాధనకర్తలు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ దాన్ని సమర్థవంతంగా పాటించడానికి ప్రజలందరూ సంఘటితం కావాలని పిలుపు ఇచ్చారు.
(రిలీజ్ ఐడి: 1607463)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160