సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నోవల్ కరోనావైరస్ (సిఒవిఐడి-19) కి సంబంధించిన అదనపు సలహాలు
Posted On:
19 MAR 2020 6:02PM by PIB Hyderabad
• 2020వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి ఒక వారం రోజు ల పాటు ఏ నిర్దిష్ట అంతర్జాతీయ వాణిజ్య సరళి ప్రయాణికుల విమానాన్ని కూడాను భారతదేశం లో దిగేందుకు అనుమతించడం జరుగదు.
• 65 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన పౌరులు అందరి ని (వైద్య సహాయం అవసరపడిన వారు మినహా) ఇంటికే పరిమితం కావలసింది గా సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆదేశాల ను జారీ చేయాలి. ప్రజా ప్రతినిధులు/ప్రభుత్వ ఉద్యోగులు/ వైద్య వృత్తి నిపుణుల కు మాత్రం ఈ ఆదేశం వర్తించదు.
• అదేవిధం గా, పదేళ్ల లోపు బాలలందరి కి వారందరూ ఇళ్లలోనే ఉండాలని, బయట తిరగవద్దంటూ హితం చెప్పాలి.
• విద్యార్థులకు, రోగులకు మరియు దివ్యాంగుల కు మినహా అన్ని విధాలైన రాయితీలతో కూడిన ప్రయాణాల ను పౌర విమానయాన శాఖ మరియు రైల్వేస్ తాత్కాలికంగా నిలుపుదల చేయాలి.
• అత్యవసర సేవ లు/అనివార్య సేవ ల విభాగాల లో విధులు నిర్వహించే వారు మినహా ప్రయివేటు రంగ ఉద్యోగుల విషయం లో వారు ఇంటి నుండే పని చేసే విధానాన్ని అమలుపరచవలసింది గా రాష్ట్రాల ను కోరడమైనది.
• కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయం లో గ్రూపు బి ఉద్యోగుల ను మరియు గ్రూపు సి ఉద్యోగుల ను వారు అంతా ఒకే చోటు లో గుమికూడటాన్ని తగ్గించేందుకుగాను వారం విడచిపెట్టి వారం పద్ధతి లో కార్యాలయాల కు హాజరవ్వాలని కోరడం జరుగుతుంది; అలాగే ఉద్యోగులందరి కి దఫావారీ వేళల ను తెలియజేయడం జరుగుతుంది.
(Release ID: 1607246)
Visitor Counter : 232