మంత్రిమండలి

ఆరోగ్య రంగం లో స‌హ‌కారాని కి గాను కోట్ డిలవోయిర్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఒక ఎమ్ ఒ యు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 MAR 2020 4:12PM by PIB Hyderabad

ఆరోగ్యం రంగం లో స‌హ‌కారం అంశం లో రిప‌బ్లిక్ ఆఫ్ కోట్ డిలవోయిర్ యొక్క  ఆరోగ్యం మ‌రియు సార్వ‌జ‌నిక స్వ‌స్థ‌త మంత్రిత్వ శాఖ కు, భార‌త‌దేశ గ‌ణ‌తంత్రం యొక్క ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద పత్రాని(ఎంఒయు)కి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

 

ఈ స‌హకార పూర్వ‌క‌ ఒప్పందపత్రం లో క్రింద ప్ర‌స్తావించిన రంగాల లో స‌హ‌కారాన్ని చేర్చడమైంది : -

 

  1. అధునాత‌న వైద్య సంబంధిత సాంకేతిక విజ్ఞానం, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, మూత్ర‌పిండ సంబంధిత మార్పిడి, హృద‌యకోశ శ‌స్త్ర చికిత్స‌, మూత్రపిండ శాస్త్రం, హీమోడాయ‌లిసిస్‌, వైద్య సంబంధిత ప‌రిశోధ‌న రంగాల లో వైద్యులు, అధికారులు, ఇత‌ర ఆరోగ్య సంబంధి వృత్తి నిపుణుల కు మరియు నిపుణుల కు శిక్ష‌ణ ను ఇవ్వ‌డం, వారి సేవ‌ల ను ఒక ప‌క్షం నుండి మ‌రొక ప‌క్షం అందుకోవ‌డం;
  2. ఔష‌ధాలు మ‌రియు ఫార్మ‌స్యుటిక‌ల్ ప్రోడ‌క్ట్ స్ యొక్క వ్య‌వ‌స్థీక‌ర‌ణం;
  3. ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల ప్రారంభం లో మ‌రియు మాన‌వ వ‌న‌రుల వికాసం లో స‌హాయాన్ని అందించుకోవ‌డం;
  4. వైద్య‌ప‌ర‌మైన‌టువంటి మ‌రియు ఆరోగ్య సంబంధ‌మైన‌టువంటి ప‌రిశోధ‌న ల అభివృద్ధి;
  5. వైద్య సంబంధ‌మైన సేవ‌ల ను అందించ‌డం కోసం వ్య‌క్తుల త‌ర‌లింపులు స‌హా సార్వ‌జ‌నిక స్వాస్థ్య సేవ‌ లు మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ నిర్వ‌హ‌ణ‌;
  6. జెన‌రిక్‌, ఇంకా అత్య‌వ‌స‌ర ఔష‌ధాల కొనుగోలు మ‌రియు మందుల స‌ర‌ఫ‌రాల‌ తాలూకు వనరుల సంబంధి స‌హాయం;
  7. హెచ్ఐవి/ఎఐడిఎస్ రంగం లో స‌హ‌కారం మ‌రియు ప‌రిశోధ‌న‌;
  8. మహమ్మారి విజ్ఞాన నిఘా కోసం అనుస‌రించద‌గ్గ వ్యూహాలు మ‌రియు టెక్నిక్కుల ను అభివృద్ధి ప‌ర‌చ‌డం, ఇంకా వాటికి మెరుగులు దిద్ద‌డం;
  9. ప్రాథమిక స్వాస్థ్య సంరక్షణ క్షేత్రం లో సర్వోత్తమమైన కార్య ప్రణాళిక లను పరస్పరం అందించుకోవ‌డం;
  10. సముదాయ ఆరోగ్య సంర‌క్ష‌ణ కేంద్రాలు మ‌రియు వైద్యశాల ల నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన జ్ఞానాన్ని ప‌ర‌స్ప‌రం వెల్ల‌డించుకోవ‌డం;
  11. వైద్య సంబంధిత వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ లో ఇరుప‌క్షాలు వాటి యొక్క అనుభ‌వాల ను ఒక‌ పక్షం తో మ‌రొక‌ పక్షం వెల్ల‌డించుకోవ‌డం;
  12. ఆరోగ్య సంవర్ధన మరియు రోగ నివారణ;
  13. అసాంక్రామిక రోగాల విష‌యం లో చ‌ర్య‌ లు;
  14. వృత్తి సంబంధ‌మైన‌టువంటి మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ సంబంధ‌మైన‌టువంటి ఆరోగ్యం;
  15. చికిత్స సంబంధిత ప‌రిశోధ‌న‌; ఇంకా
  16. ఉభ‌య ప‌క్షాలు నిర్ణ‌యించే మేర‌కు మ‌రేదైనా రంగం లో స‌హకారం.

ఈ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం అమ‌లు ను ప‌ర్య‌వేక్షించ‌డం కోసం, అలాగే త‌త్సంబంధిత స‌హ‌కారాని కి వివ‌ర‌ణ లను భవిష్యత్తు లో విస్తరించ‌డం కోసం ఒక వ‌ర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.

 

**


(Release ID: 1605272) Visitor Counter : 135