మంత్రిమండలి

మత్స్య పరిశ్రమ లో నిలుకడతనం కలిగిన అభివృద్ధి రంగం లో భారతదేశాని కి మరియు ఐస్ లాండ్ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 12 FEB 2020 3:54PM by PIB Hyderabad

మత్స్య పరిశ్రమ రంగం లో భారతదేశాని కి మరియు ఐస్ లాండ్ కు మధ్య సంతకాలైన ఒక  అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడం జరిగింది.  ఈ ఎంఒయు పై 2019వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ నాడు సంతకాలు అయ్యాయి.

ఈ ఎంఒయు లోని ముఖ్యాంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:

ఎ.    సముద్ర తీరానికి ఆవల మరియు సముద్ర అంతర్భాగ ప్రాంతాల లో మొత్తం మీద అనుమతించదగిన చేపల వేట పరిమాణాన్ని మదింపు చేసే రంగాల కు సంబంధించి శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల ఆదాన ప్రదానాని కి మరియు వారి సముచిత నియామకాల కు అవసరమైన చర్యల ను తీసుకోవడం;

బి.    ఆధునిక మత్స్య పరిశ్రమ నిర్వహణ మరియు ఫిశ్ ప్రోసెసింగ్ రంగాల కు చెందిన వివిధ అంశాల లో కీలకమైన ఫిశరీజ్ ఇన్స్ టిట్యూశన్స్ యొక్క వృత్తి నిపుణుల కు శిక్షణ ను ఇవ్వడం.

సి.    వైజ్ఞానిక పరిశోధన ఫలితాల నివేదికల ను మరియు ఇతర సమాచారాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం ఇవ్వడం/పుచ్చుకోవడం.

డి.    చేపల వేట కు గల అవకాశాల ను అధ్యయనం చేయడం కోసం నిపుణుల యొక్క / నైపుణ్యం  యొక్క ఆదాన ప్రదానాలు.  నవపారిశ్రామికత్వం అభివృద్ధి అయ్యేటట్టు హై సీస్ ఫిశరీజ్ తాలూకు ఉత్పత్తుల  ప్రోసెసింగ్, ఇంకా మార్కెటింగ్.

 

 

ఈ ఎంఒయు భారతదేశాని కి మరియు ఐస్ లాండ్ కు మధ్య ఇప్పటికే నెలకొన్న మైత్రీపూర్వక సంబంధాల ను మరింత గా బలోపేతం చేస్తుంది.  దీనితో పాటు ద్వైపాక్షిక సమస్యల పై సంప్రదింపులు సహా మత్స్య పరిశ్రమ సంబంధిత సహకారాన్ని మరియు సంప్రదింపుల ను ప్రోత్సహిస్తుంది.

**

 


(Release ID: 1602990) Visitor Counter : 242