ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ పై తాజా సమాచారం : ప్రయాణికులకు సవరించిన సలహాల జారీ
Posted On:
03 FEB 2020 10:24AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ కు సంబంధించి సరిక్రొత్త గా ఒక ప్రకటన ను విడుదల చేసింది. అందులో -
నిన్నటి రోజు న తెలియజేసిన విధం గా, చైనా కు ప్రయాణించడం నిలిపివేసుకోలసింది గా ప్రజల కు ఇచ్చిన సమాచారం లో మరికొన్ని మార్పు చేర్పుల ను చేయడమైంది. 2020వ సంవత్సరం జనవరి 15వ తేదీ నాటి నుండి చైనా ను సందర్శించిన వారిని మరియు ఇక నుండి చైనా ను సందర్శించే వారి ని ఇతరులతో కలవనీయకుండా ఒంటరి ఆవాసాని కి (క్వారంటీన్) పరిమితం చేసే అవకాశం ఉంది.
• చైనా పాస్ పోర్టు ను కలిగి ఉన్న వారి కి ఇ-వీసా (ఇలెక్ట్రానిక్ వీసా) సౌకర్యాన్ని తాత్కాలికం గా నిలుపుదల చేయడమైంది.
• చైనా దేశస్తుల కు ఇప్పటికే జారీ అయిన ఇ-వీసా తాత్కాలికం గా చెల్లుబాటు కాదు.
• చైనా నుండి భౌతిక వీజ ను సంపాయించుకొనేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు ను సమర్పించే అవకాశాన్ని కూడా నిలిపివేయడం జరిగింది.
• తప్పనిసరి కారణాల వల్ల భారతదేశాన్ని సందర్శించవలసిన వారు బీజింగ్ లోని భారతదేశ రాయబార కార్యాలయాన్ని గాని, లేదా శంఘాయీ లో లేదా గువాంగ్ ఝూ లో గల కాన్సులేట్ లను గాని సంప్రదించవలసింది గా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.
(Release ID: 1601682)
Visitor Counter : 254