ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఒడిఎఫ్ ప్ర‌వ‌ర్త‌న‌ను నిల‌బెట్టేందుకు ఒడిఎఫ్ ప్ల‌స్‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది

2020-21 సంవ‌త్స‌రానికి స్వ‌చ్ఛ‌భార్‌త మిష‌న్‌కు 12,300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ నిధులు
వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌తోపాటు లిక్విడ్‌, గ్రేవాట‌ర్ మేనేజ్‌మెంట్ పై దృష్టి.
జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కు 3.60 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అనుమ‌తి

Posted On: 01 FEB 2020 2:05PM by PIB Hyderabad

ఒడిఎఫ్ ప్ర‌వ‌ర్త‌న కొన‌సాగేలా చూసేందుకు , అలాగే ఈ కార్య‌క్ర‌మం కింద ఎవ‌రినీ విడిచిపెట్ట‌కుండా చూసేందుకు ప్ర‌భుత్వం ఒడిఎఫ్ ప్ల‌స్ కు క‌ట్టుబ‌డి ఉంది. 2020-21 బ‌డ్జెట్‌ను పార్ల‌మెంటుకు స‌మ‌ర్పిస్తూ ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, లిక్విడ్‌, గ్రే వాట‌ర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్ర‌స్తుతం చేయ‌వ‌ల‌సింది ఎంతో ఉంద‌ని అన్నారు. ఘ‌న రూప వ్య‌ర్థాల సేక‌ర‌ణ‌,వాటిని వేరు చేయ‌డం, ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టి పెట్ట‌నున్నామ‌ని చెప్పారు. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ కింద 2020 -21 సంవ‌త్స‌రానికి మొత్తం 12,300 కోట్ల రూపాయ‌లు కేటాయించనున‌ట్టు చెప్పారు.

అన్ని ఇళ్ల‌కు పైపు ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు ఉద్దేశించిన జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కు 3.60 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఆమోదించిన‌ట్టు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ ప‌థ‌కం స్థానిక నీటి వ‌న‌రుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీక‌రించ‌డ‌మే కాకుండా ఉప్పునీటిని మంచినీటిగా మార్చ‌డం, నీటివ‌న‌రుల సంర‌క్ష‌ణ‌పై దృష్టిపెడుతుంద‌ని మంత్రి చెప్పారు. ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాపై బ‌డి క‌లిగిన ప‌ట్ట‌ణాలు ఈ ల‌క్ష్యాన్ని ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే చేరుకునేలా ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి చెప్పారు. 2020-21 సంవ‌త్స‌రంలో ఈ ప‌థ‌కానికి 11,500 కోట్ల రూపాయ‌లు అందించ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి చెప్పారు.

****



(Release ID: 1601615) Visitor Counter : 139